iDreamPost
android-app
ios-app

Valari OTT: డైరెక్ట్‌గా OTTలోకి హార‌ర్‌ మూవీ! భయపడకుండా చూడగలరా?

  • Published Jan 31, 2024 | 2:16 PM Updated Updated Jan 31, 2024 | 2:16 PM

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో వరుసగా సినిమాలు సందడి చేస్తున్నాయి. థియేటర్లలో విడుదలకు వీలుకాని ఎన్నో చిత్రాలకు.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే రితికా సింగ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఓ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధం అయింది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో వరుసగా సినిమాలు సందడి చేస్తున్నాయి. థియేటర్లలో విడుదలకు వీలుకాని ఎన్నో చిత్రాలకు.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే రితికా సింగ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఓ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధం అయింది.

  • Published Jan 31, 2024 | 2:16 PMUpdated Jan 31, 2024 | 2:16 PM
Valari OTT: డైరెక్ట్‌గా OTTలోకి హార‌ర్‌ మూవీ! భయపడకుండా చూడగలరా?

మాధ‌వ‌న్ హీరోగా న‌టించిన ఇరుదుసుట్రు సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రితికా సింగ్‌. దీనినే గురు అనే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. వెంకటేష్ నటించిన గురు సినిమా ఫేమ్ రితికా సింగ్ అంటే అందరు త్వరగా గుర్తుపట్టేస్తారు. టాలీవుడ్ లోను మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు రితికా సింగ్ తాజాగా నటిస్తోన్న చిత్రం “వ‌ళ‌రి” . ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి శ్రీరామ్ ఫ‌స్ట్‌లుక్‌ను విడుదల చేశారు. హర్రర్ కథాంశంతో ఈ మూవీ ఉండబోతుందని సమాచారం. మరి, ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో విడుదల కానుంది. ఈ చిత్రంలో నటించిన నటీ నటులు ఎవరు? అనే వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిత్రంలో రితికా సింగ్‌తో పాటు శ్రీరామ్ ప్ర‌ధాన పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో నేవీ ఆఫీస‌ర్‌గా సెల్యూట్ చేస్తూ క‌నిపించాడు శ్రీరామ్. ఇందులో శ్రీరామ్‌ కెప్టెన్ న‌వీన్ నాయుడు అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అతని వెనుక ఓడ‌తో పాటు మువ్వెన్న‌ల జెండా, ఆర్మీ హెలికాప్ట‌ర్ క‌నిపిస్తున్నాయి. దీని ప్రకారంగా దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా సాగే హార‌ర్ మూవీ అని తెలుస్తోంది. అంతేకాకుండా త్వ‌ర‌లోనే రితికా సింగ్ ఫ‌స్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక ఈ చిత్రానికి మ్రితికా సంతోషిణి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. ఆమెకు ఇదే తొలి చిత్రం అనే టాక్ వినిపిస్తోంది. ఇక టాలీవుడ్ న‌టుడు సుబ్బ‌రాజ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇక “వ‌ళ‌రి” సినిమా ఫిబ్ర‌వ‌రి మొదటి వారంలో ఈటీవీ విన్ లో విడుదల కానున్నట్లు సమాచారం. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట మేకర్స్.

ఇక రితిక సింగ్ విషయానికొస్తే.. గురు త‌ర్వాత క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది ఈ భామ. కానీ, అవి ఆమెకు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. ఇక ప్రస్తుతం ర‌జ‌నీకాంత్ వెట్టైయాన్‌లో రితికా సింగ్ ఓ యాక్ష‌న్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. మరో వైపు పిండం మూవీతో సోలో హిట్ సాధించిన శ్రీరామ్ కూడా డిఫ‌రెంట్ మూవీస్‌, క్యారెక్ట‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు వ‌ళ‌రిలో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇక త్వరలో ఈటీవీ విన్ లో విడుదల కానున్న “వ‌ళ‌రి” ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbet