iDreamPost
android-app
ios-app

భారీ ధరకు ‘మంగళవారం’ మూవీ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ OTT!

  • Published Nov 15, 2023 | 6:41 PM Updated Updated Nov 15, 2023 | 6:41 PM

బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించిన సినిమా మంగళవారం. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే విడుదలకు ముందే ఓటీటీ ప్లాట్ ఫామ్ కన్పామ్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించిన సినిమా మంగళవారం. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే విడుదలకు ముందే ఓటీటీ ప్లాట్ ఫామ్ కన్పామ్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

  • Published Nov 15, 2023 | 6:41 PMUpdated Nov 15, 2023 | 6:41 PM
భారీ ధరకు ‘మంగళవారం’ మూవీ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ OTT!

క్రికెట్ ప్రియులను ఓ వైపు వన్డే వరల్డ్ కప్ అలరిస్తుంటే మరో వైపు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సినిమాలతో క్రికెట్ లవర్స్ తో పాటు మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఎంటర్ టైన్ మెంట్ పంచుతున్నాయి. బిజీలైఫ్ వలన థియేటర్ కు వెళ్లలేని వారు ఇంటిదగ్గరే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరో తెలుగు సినిమా ఓటీటీలో సందడిచేయబోతోంది. విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసిన మంగళవారం సినిమా ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇంతకీ మంగళవారం సినిమా ఏ ఓటీటీలోకి రాబోతుందంటే?

డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా మంగళవారం. ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తోంది. ఆర్ఎక్స్ 100 తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన పాయల్ మరోసారి ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 17 న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.ఇప్పటికే మంగళవారం మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెరిగాయి. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే ఓటీటీ ప్లాట్ ఫామ్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది.

మంగళవారం సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా స్పష్టత లేదు. చిత్ర యూనిట్ గాని, ఆహా గాని అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఈ మూవీలో నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ గోష్, శ్రవణ్ రెడ్డి, శ్రీతేజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom