iDreamPost
android-app
ios-app

Parasyte- The Grey: OTTలోకి వస్తున్న సూపర్ థ్రిల్లర్.. ట్రైలర్ కే వణుకు పుడుతోంది..

  • Published Mar 11, 2024 | 5:16 PM Updated Updated Mar 14, 2024 | 5:53 PM

మునుపెన్నడూ చూడని విధంగా కొరియన్ సిరీస్ లో .. ఓ కొత్త లైవ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ రాబోతుంది. అదే పారసైట్- ది గ్రే . తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. మరి, ఈ సిరీస్ ఓటీటీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం.

మునుపెన్నడూ చూడని విధంగా కొరియన్ సిరీస్ లో .. ఓ కొత్త లైవ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ రాబోతుంది. అదే పారసైట్- ది గ్రే . తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. మరి, ఈ సిరీస్ ఓటీటీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం.

  • Published Mar 11, 2024 | 5:16 PMUpdated Mar 14, 2024 | 5:53 PM
Parasyte- The Grey: OTTలోకి వస్తున్న సూపర్ థ్రిల్లర్.. ట్రైలర్ కే వణుకు పుడుతోంది..

ఓటీటీ లో విడుదలయ్యే ప్రతి సినిమాను, ప్రతి సిరీస్ ను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా .. స్టోరీ అండ్ యాక్షన్ సిక్వెన్సెస్ బావుంటే కనుక.. వెంటనే ఆ సినిమాకు కానీ, సిరీస్ కు కానీ.. మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టీరీస్, సూపర్ న్యాచురల్ డ్రామాస్, హర్రర్ మూవీస్ ఇలా ఎన్నో చిత్రాలను చూసి ఉంటాం. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయే సూపర్ థ్రిల్లర్ మాత్రం .. మునుపెన్నడూ చూడని విధంగా .. ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇది జపనీస్ ఫిక్షన్ ఆధారంగా రూపొందించినప్పటికీ.. ఒక కొరియన్ ప్రొడక్షన్ హౌస్ ఈ సిరీస్ ను రూపొందించడం విశేషం. లైవ్ యాక్షన్ సిరీస్ గా పేరొందుతున్న ఈ సిరీస్ పేరు “పారసైట్: ది గ్రే”. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రేక్షకులకు తెలియని ఎన్నో సరికొత్త ఎలెమెంట్స్ ఈ ట్రైలర్ లో దాగి ఉన్నాయని చెప్పి తీరాలి.

‘హెల్ బౌండ్’ , ‘ట్రైన్ టు బుసాన్’ అనే పాపులర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన.. యోన్ సాంగ్ హో..పారసైట్: ది గ్రే సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ లో జియోన్ సోని ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. విడుదల చేసిన ట్రైలర్ ప్రకారం ఈ సిరీస్ కథ ఎలా ఉండబోతుందటే.. భూమిపై తమ ఆధిపత్యాన్ని చలాయించడానికి, ఇక్కడ నివసిస్తున్న మనుషులను.. తమ కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు.. కొంతమంది వ్యక్తులను.. ఏలియన్ పారసైట్స్ తమ ఆదీనంలోకి తీసుకుంటాయి. ఇక జియోన్ సోని పాత్ర విషయానికొస్తే.. ఆమె ఏలియన్స్ లో ఒక దానికి హోస్ట్ గా మారుతుంది. పారసైట్ తన చేతికి దక్కిన తర్వాత.. దానిని తన బ్రెయిన్ లోకి ప్రవేశించకుండా ఆమె ఆపివేస్తుంది. దాని కారణంగా ఆ పారసైట్ బ్రెయిన్ లోకి ఎంటర్ అయ్యే శక్తి సామర్ధ్యాలను కోల్పోతుంది. ఇలా ఆ ఏలియన్ కలిసి బ్రతకడానికి .. ఓ యువతి చేసిన పోరాటమే ఈ సిరీస్ కథగా ఉండబోతుంది. ఇక ఈ సిరీస్ ఏప్రిల్ 5నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.

దాదాపు ఇప్పుడు ఎక్కువగా అందరు కొరియన్ సిరీస్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కొరియన్ సిరీస్ లను ఇష్టపడే వారికీ పారసైట్:ది గ్రే సిరీస్ ఖచ్చింతంగా ఓ మంచి థ్రిల్లింగ్ ఎక్సపీరియెన్స్ ను ఇస్తుందని చెప్పొచ్చు. ట్రైలర్ లో చూపించిన విజువల్స్ చూస్తూనే అందరికి వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. కే-డ్రామా ప్లాట్ లో కొనసాగే ఓ మంచి హర్రర్ సస్పెన్స్, లైవ్ యాక్షన్ థ్రిల్లర్ ఈ “పారసైట్- ది గ్రే” సిరీస్. ప్రస్తుతం విడుదల చేసిన టైలర్ తో ఈ సిరీస్ పై.. మరింత ఆసక్తి నెలకొంది. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉండబోతుంది అని తెలియాలంటే .. ఏప్రిల్ 5వరకు వేచి చూడాల్సిందే. మరి కొరియన్ సిరీస్ అయిన “పారసైట్- ది గ్రే” ట్రైలర్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetalobetCasibom girişcasibomJojobet GirişcasibomcasibomcasibomjojobetartemisbetMadridbetMadridbetcasibom girişcasibom girişganobetpokerklasjojobetMarsbahis GüncelCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom GirişGrandPashaBet Şikayet