iDreamPost
android-app
ios-app

Naga Chaitanya: లక్‌ తెచ్చిన ‘‘దూత’’.. నాగ చైతన్యకు ప్యాన్‌ వరల్డ్‌ స్టార్‌డమ్‌..

నాగ చైతన్య చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటి వరకు పదికి పైగా సినిమాలు చేశారు. ఈ చిత్రాలతో రాని గుర్తింపు ఒక్క వెబ్‌సిరీస్‌తో వచ్చింది...

నాగ చైతన్య చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటి వరకు పదికి పైగా సినిమాలు చేశారు. ఈ చిత్రాలతో రాని గుర్తింపు ఒక్క వెబ్‌సిరీస్‌తో వచ్చింది...

Naga Chaitanya: లక్‌ తెచ్చిన ‘‘దూత’’.. నాగ చైతన్యకు ప్యాన్‌ వరల్డ్‌ స్టార్‌డమ్‌..

గత కొంత కాలంగా ఇండస్ట్రీలో ప్యాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో టాప్ హీరోలంతా ప్యాన్‌ ఇండియా సినిమాలకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా చిత్రం విడుదల అవ్వటం.. అక్కడ కూడా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉండటంతో ప్యాన్‌ ఇండియా చిత్రాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌,  అల్లు అర్జున్‌, నాని, నిఖిల్‌లు ప్యాన్‌ స్టార్సుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే, వీరందరిదీ ఒక ఎత్తు అయితే.. అక్కనేని వారసుడిది ఇంకో ఎత్తు.. సినిమాల ద్వారా రాని గుర్తింపు.. ఆయనకు ఒక్క వెబ్‌ సిరీస్‌తో వచ్చేసింది. దేశ వ్యాప్తంగా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆయన తాజా వెబ్‌ సిరీస్‌ రికార్డు సృష్టిస్తోంది. నాగచైతన్య విక్రమ్‌ కే కుమార్ కాంబినేషన్‌లో దూత వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య మొదటి వెబ్‌ సిరీస్‌. ధూత వెబ్‌ సిరీస్‌తోటే ఆయన ఓటీటీలో​కి ఎంట్రీ ఇచ్చారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెం‍ట్స్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించింది.

తెలుగు నిర్మాత శరత్‌ మరార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దూతను నిర్మించాయి. ఇందులో పార్వతీ తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచి దేశాయి, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్‌ 40 నిమిషాల నిడివితో ఉంటుంది. డిసెంబర్‌ 1వ తేదీనుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ అమెజాన్ ప్రైమ్‌లోని 38 భాషల్లో సబ్‌ టైటిల్స్‌తో.. దాదాపు 240 దేశాల్లో రిలీజ్ చేశారు.

ఇక, అందర్నీ థ్రిల్‌కు గురిచేస్తున్న దూత అమెజాన్‌ ప్రైమ్‌లో నెంబర్ 1 పొజిషన్లో ట్రెండ్‌ అవుతోంది. నాగ చైతన్యకు ఓటీటీ ఎంట్రీతోటే మంచి గుర్తింపు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సెలెబ్రిటీ అవుతున్నారు. ధూత వెబ్ సిరీస్‌కు ఎవరూ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ వెబ్ సిరీస్ చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చైతన్యకు కూడా ఇదే మొదటి వెబ్ సిరీస్ కావడంతో.. చై ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమాల్లో దక్కని పాన్ ఇండియా క్రేజ్, చేసిన ఫస్ట్ సిరీస్‌తో దక్కడంతో.. సోషల్ మీడియా వేదికగా వారి ఆనందాన్ని నలుగురితో పంచుకుంటున్నారు. అంతేకాదు! ఇలాంటి మరిన్ని సిరీస్‌లు చేయాలని కోరుకుంటున్నారు. మరి, రికార్డులు సృష్టిస్తున్న చై చేసిన ధూత వెబ్‌ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి