OTTలో బెస్ట్ సైన్స్ థ్రిల్లర్.. తన కుటుంబాన్ని తన చేతులతోనే..

OTT Suggestions- Best Scientific Suspense Thriller: ఓటీటీలు వచ్చిన తర్వాత సైంటిఫిక్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ కు డిమాండ్ పెరిగింది. అందుకే మీకోసం ఒక బెస్ట్ సైంటిఫిక్ సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకొచ్చాం.

OTT Suggestions- Best Scientific Suspense Thriller: ఓటీటీలు వచ్చిన తర్వాత సైంటిఫిక్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ కు డిమాండ్ పెరిగింది. అందుకే మీకోసం ఒక బెస్ట్ సైంటిఫిక్ సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకొచ్చాం.

సైన్స్ థ్రిల్లర్స్, సైంటిఫిక్ మూవీస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. మరీ ఇంటర్ స్టెల్లర్ వంటి మూవీస్ కాకపోయినా.. ఒక మాదిరి చిత్రాలను చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఒక మంచి బెస్ట్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ తీసుకొచ్చాం. ఈ సినిమా ఒక సైంటి ఫిక్ థ్రిల్లర్ మాత్రమే కాదు.. మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న మూవీ కూడా. ఈ చిత్రంలో హీరో అతనే.. విలన్ కూడా అతనే. తన జీవితాన్ని బాగుచేసుకున్నది.. నాశనం చేసుకుంది కూడా అతనే. ఆఖరికి తనని తానే కిడ్నాప్ చేసుకుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలో చాలానే ట్విస్టులు, కళ్లు బైర్లుకమ్మే విషయాలు ఉంటాయి. మరి ఆ మూవీ ఏది? అందులో అంత స్పెషల్ ఏం ఉందో చూద్దాం.

సాధారణంగా సైన్స్ థ్రిల్లర్ అనగానే.. కచ్చితంగా సినిమాలో ఏదో ఇన్వెన్షన్, దాని చుట్టూ జరిగే కథ ఉంటుంది. కానీ, ఈ మూవీలో మాత్రం ఒక సైంటిస్ట్ చుట్టూ కథ జరుగుతూ ఉంటుంది. అయితే ఆయన తన జీవితాన్ని ఒక సాధారణమైన సైన్స్ టీచర్ గా సాగిస్తూ ఉంటాడు. అతనికి ఎంతో అందమైన భార్య కూడా ఉంటుంది. అలాగే వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. అలా వారి జీవితం ఎంతో సాధారణంగా, సగటు మధ్యతరగతి భర్తగా తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. అయితే నిజానికి అది అతని లైఫ్ కాదు. అది అతని జీవితం కాదు. వాస్తవానికి అసలు అది అతని రియాలిటీనే కాదు. అతను ఒక గొప్ప సైంటింస్ట్. ఎంతో గొప్ప వస్తువును కూడా ఆవిష్కరించాడు.

సాధారణంగా బాగా తెలివైన వాళ్లకి మతిమరుపు ఉంటుంది అని తెలిసిందే. అయితే ఈయన ఏకంగా తన గతాన్నే మర్చిపోతాడు. ఇలా ఒక సైన్స్ టీచర్ గా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అతడిని ఎవరో దుండగులు అపహరిస్తారు. లేచి చూస్తే అంతా మారిపోతుంది. అసలు అతని కుటుంబం, పిల్లలు ఎవ్వరూ ఉండరు. అతడిని ఆ సిటీలో ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరూ గుర్తు కూడా పట్టారు. అసలు అతని ఏం జరిగింది? ఏం జరుగుతోంది? అనే విషయాలు తెలియదు. తర్వాత అసలు అతడిని ఎందుకు కిడ్నాప్ చేశారో చెప్తారు. అతను ఒక బాక్స్ అనే వస్తువును తయారు చేశాడు. అందులో ఒక కొత్త ప్రపంచమే ఉంటుంది. కానీ, అతడికి ఆ బాక్స్ గురించి ఏమీ గుర్తులేదు.

ఇలా కథ అనేది కొత్త కోణంలోకి మలుపు తిరుగుతుంది. ఆ సైంటిస్ట్ ఎవరు? అతడిని కిడ్నాప్ చేసింది కూడా అతడే అనే విషయం వెలుగు చూస్తుంది. ఇలా కథలో చాలానే ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులను మీరు ఊహించను కూడా లేరు. అలా ఒక్కో సీన్, ఒక్కో క్యారెక్టర్ మీకు బుర్రపాడు చేస్తుంటుంది. ఈ సినిమా పేరు డార్క్ మ్యాటర్. ఈ మూవీ యాపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ చూశాక మీకు కచ్చితంగా ఒక బెస్ట్ సైన్స్ థ్రిల్లర్ చూశానే అనే భావన అయితే కలుగుతుంది.

Show comments