iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్ కి పండగే.. ఒక్కరోజే OTTలోకి 12 సినిమాలు

  • Published May 17, 2024 | 9:01 AM Updated Updated May 17, 2024 | 4:29 PM

ఎప్పటి లానే మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఎప్పుడు లేనంతగా.. ఈ వీకెండ్ ఒక్క రోజే ఓటీటీల్లోకి 10 సినిమాలు వచ్చేస్తున్నాయి. ఆ వివరాలు...

ఎప్పటి లానే మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఎప్పుడు లేనంతగా.. ఈ వీకెండ్ ఒక్క రోజే ఓటీటీల్లోకి 10 సినిమాలు వచ్చేస్తున్నాయి. ఆ వివరాలు...

  • Published May 17, 2024 | 9:01 AMUpdated May 17, 2024 | 4:29 PM
మూవీ లవర్స్ కి పండగే.. ఒక్కరోజే OTTలోకి 12 సినిమాలు

ఒకప్పుడు శుక్రవారం వచ్చిందంటే చాలు మూవీ లవర్స్ థియేటర్లకు పరుగులు తీసేవారు. విడుదలైన ప్రతి కొత్త సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చాలా మంది భావించేవారు. స్టార్ హీరోల సినిమాల విడుదల రోజైతే.. ఇక థియేటర్ల దగ్గర చిన్న పాటి యుద్ధవాతావరణమే ఉండేది. హీరోలకు పెద్ద పెద్ద కటౌట్లు, పాలభిషేకాలు, టపాసుల మోతతో పండగ వాతావరణం కనిపించేది. అయితే కరోనా తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్ల వద్ద సందడి తగ్గింది. హాలుకి వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఇప్పుడు శుక్రవారం అంటే.. ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. మరి ఈ వీకెండ్లో వచ్చే సినిమాలు ఏవో మీరు ఓ లుక్కేయండి.

చూస్తుండగానే ఈ వారం వేగంగా దొర్లిపోతూ.. మరో వీకెండ్‌ వచ్చేసింది. ఈ వారంలో థియేటర్ల వద్ద చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. స్టార్ హీరోల సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో సినీ ప్రియులంతా ఓటీటీలవైపే చూస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాయి. ఇక శుక్రవారం ఒక్క రోజే ఓటీటీలోకి 10 సినిమాలు వచ్చేస్తున్నాయి.

ఎప్పటిలాగే ఈ వీకెండ్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. వీటిల్లో ఆదాశర్మ నటించిన బస్తర్, రాజమౌళి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్), సత్యదేవ్ కృష్ణమ్మ, విద్యా వాసుల అహం సినిమాలు ఆడియన్స్‌లో కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు హిందీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సైతం స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 10కి పైగా సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అంటే..

ఈ శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు

నెట్‌ఫ్లిక్స్

  • పవర్ (ఇంగ్లీష్ మూవీ) – మే 17
  • ద 8 షో (కొరియన్ సిరీస్) – మే 17
  • థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) – మే 17

అమెజాన్ ప్రైమ్

  • 99 (ఇంగ్లీష్ సిరీస్) – మే 17
  • కృష్ణమ్మ (తెలుగు సినిమా) – మే 17

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) – మే 17

జీ5

  • బస్తర్: ద నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) – మే 17
  • తళమై సెయలగమ్ (తమిళ సిరీస్) – మే 17

ఆహా

విద్యా వాసుల అహం – (తెలుగు సినిమా) – మే 17

జియో సినిమా

  • జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా) – మే 17

ఆపిల్ ప్లస్ టీవీ

  • ద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 17

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • ఎల్లా (హిందీ సినిమా) – మే 17

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss