iDreamPost
android-app
ios-app

OTT Release: మూవీ లవర్స్‌కి పండగే.. ఈ వారం OTTల్లోకి 16 సినిమాలు.. లిస్ట్‌ ఇదే

  • Published Apr 29, 2024 | 9:52 AM Updated Updated Apr 29, 2024 | 9:52 AM

మరో వారం వచ్చేసింది. ఎప్పటిలానే ఈ వీక్‌.. ఓటీటీల్లో విడుదలయ్యేందుకు సినిమాలు రెడీ అయ్యాయి. 16 చిత్రాలు ఓటీటీల్లోకి రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. వాటి లిస్ట్‌ ఇదే..

మరో వారం వచ్చేసింది. ఎప్పటిలానే ఈ వీక్‌.. ఓటీటీల్లో విడుదలయ్యేందుకు సినిమాలు రెడీ అయ్యాయి. 16 చిత్రాలు ఓటీటీల్లోకి రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. వాటి లిస్ట్‌ ఇదే..

  • Published Apr 29, 2024 | 9:52 AMUpdated Apr 29, 2024 | 9:52 AM
OTT Release: మూవీ లవర్స్‌కి పండగే.. ఈ వారం OTTల్లోకి 16 సినిమాలు.. లిస్ట్‌ ఇదే

ఓటీటీలకు రోజు రోజుకు క్రేజ్‌ పెరుగుతోంది. థియేటర్‌కు వెళ్లి సినిమాలు చేసే ప్రేక్షకులు కాస్త ఓటీటీల వైపు మళ్లుతున్నారు. వాటికి క్రేజ్‌ పెరగడంతో.. ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం భారీగా ఖర్చు చేసి.. మంచి కంటెంట్‌ను వారికి అందించేందుకు కృషి చేస్తున్నాయి. ఒకదానితో ఒకటి పోటీ పడి మరి ప్రేక్షకుల కోసం కొత్త సినిమాలను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మరో వారం వచ్చింది. ఎప్పటిలానే ఈ వీక్‌లో కూడా ప్రేక్షకులను పలకరించడానికి కొత్త సినిమాలు ఓటీటీల్లో రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఏకంగా 16 సినిమాలు ఓటీటీల్లో విడుదల కానున్నాయి.

ఇక ఈ వారం థియేటర్లలో విడుదల కావడానికి పెద్ద సినిమాలు ఏవి లేవు. రెండు, మూడు చిన్న సినిమాలు ఈ వారం రిలీజ్‌ కానున్నాయి. వాటిల్లో సుహాస్‌ ‘ప్రసన్నవదనం’, ‘కృష్ణమ్మ’, ‘జితేందర్ రెడ్డి’ సినిమాలు ఉన్నాయి. అయితే వీటిల్లో సుహాస్ నటించిన ‘ప్రసన్నవదనం’పై ప్రేక్షకుల్లో కాస్త అంచనాలు ఉన్నాయి. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌తో బాధపడే యువకుడిగా సుహాస్‌.. ఈ సినిమాలో నటించనున్నాడు.

తాజాగా విడుదలైన ప్రసన్నవదనం ట్రైలర్‌.. చిత్రంపై అంచనాలు పెంచింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి. ఇక ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు విడుదల కానుండగా.. వీటిల్లో చాలావరకు కొత్త చిత్రాలు రాబోతున్నాయి. వీటిలో ఓ రెండు సినిమాలపై మాత్రం ప్రేక్షకులకు కాస్త ఆసక్తి ఉంది. మరి ఈ వీక్‌ ఏ ఓటీటీల్లో ఏ సినిమాలు విడుదల కానున్నాయి అంటే..

ఓటీటీలో ఈ వారం దాదాపు 16 సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఇంగ్లీష్, హిందీ చిత్రాల సంగతి పక్కనబెడితే తెలుగులో మాత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘సైతాన్’ సినిమాలు మాత్రమే కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. మిగతా సినిమాలు ఎలా ఉంటాయో తెలియాలాంటే.. అవి రిలీజ్‌ అయ్యేంతవరకు ఆగాలి. ఇంతకీ ఈవారం ఏ ఓటీటీల్లోకి ఏ సినిమాలు రాబోతున్నాయి అంటే..

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్‌ ఇదే..

నెట్‌ఫ్లిక్స్

  • ఫియాస్కో (ఫ్రెండ్ సిరీస్) – ఏప్రిల్ 30
  • టీ పీ బన్ (జపనీస్ సిరీస్) – మే 02
  • సైతాన్ (హిందీ సినిమా) – మే 03
  • ద అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) – మే 04

అమెజాన్ ప్రైమ్

  • అంబర్ గర్ల్స్ స్కూల్ (హిందీ సిరీస్) – మే 01
  • ద ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ సినిమా) – మే 02
  • క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – మే 03
  • ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మే 03

హాట్‌స్టార్

  • ద వెయిల్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 30
  • మంజుమ్మల్ బాయ్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 05
  • మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మే 05

జియో సినిమా

  • మైగ్రేషన్ (ఇంగ్లీష్ చిత్రం) – మే 01
  • హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – మే 03
  • ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 03
  • వోంకా (ఇంగ్లీష్ మూవీ) – మే 03

ఆపిల్ ప్లస్ టీవీ

  • అకాపుల్కో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – మే 01

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş