iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా ఓటీటీకి సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Apr 20, 2024 | 8:44 AM Updated Updated Apr 20, 2024 | 8:44 AM

OTT Streaming: ఇటీవల ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ దున్నేస్తుంది. కొత్త కొత్త సినిమా నెల‌లోపే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి.

OTT Streaming: ఇటీవల ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ దున్నేస్తుంది. కొత్త కొత్త సినిమా నెల‌లోపే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి.

  • Published Apr 20, 2024 | 8:44 AMUpdated Apr 20, 2024 | 8:44 AM
సైలెంట్ గా ఓటీటీకి సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఒకప్పుడు థియేటర్లో చూడని సినిమాలు ఎప్పుడో టెలివిజన్ లో వచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. థియేటర్లో రిలీజ్ అయిన నెలలోపే కొత్త సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఓటీటీలో సినిమాలు, వెబ్ సీరీస్ చూసేవారు. ఇప్పుడు అదే అలవాటుగా మారిపోయింది.. దానికి తోడు ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి. కొంతమంది ప్రొడ్యూసర్స్ తమ సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. తాజాగా థియేటర్లో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ 20 రోజుల్లోనే ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఏ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఓటీటీలో ఇప్పుడు అన్ని భాషల చిత్రాలు ఆడియన్స్ కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయి. కన్నడ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ సోదరుడి తనయుడు యువరాజ్ కుమార్ హీరోగా ‘యువ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. మార్చి 29 న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం కేవలం 20 రోజుల్లోనే సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం రెంటల్ విధానంలో మాత్రమే అమేజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. త్వరలో ఈ మూవీ ఉచితంగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

Super hit movie on OTT!

సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ హుంబలే ఫిలిమ్స్ నిర్మించింది. ఈ చిత్రంలో యువరాజ్ కుమార్ రెజ్లర్ పాత్రలో కనించారు. ఈ మూవీకి కాంతార ఫేమ్ అజనిష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఇక యువ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడకు వరుసగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. త్వరలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న తముడు మూవీలో సప్తమి గౌడ్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetjojobetcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet