iDreamPost
android-app
ios-app

OTT Comedy Series : OTTలో కడుపుబ్బా నవ్వించే సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Jul 12, 2024 | 3:02 PM Updated Updated Jul 12, 2024 | 3:02 PM

OTT Comedy Series In Telugu: కామెడీ వెబ్ సిరీస్ లకు ఇప్పుడు క్రేజ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి సిరీస్ లు ఎంచక్కా ఫ్యామిలీ తో కలిసి చూడొచ్చు కాబట్టి.. ఈ క్రమంలో రీసెంట్ గా మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ వెబ్ సిరీస్ ఓటీటీ లోకి రానుంది.

OTT Comedy Series In Telugu: కామెడీ వెబ్ సిరీస్ లకు ఇప్పుడు క్రేజ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి సిరీస్ లు ఎంచక్కా ఫ్యామిలీ తో కలిసి చూడొచ్చు కాబట్టి.. ఈ క్రమంలో రీసెంట్ గా మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ వెబ్ సిరీస్ ఓటీటీ లోకి రానుంది.

  • Published Jul 12, 2024 | 3:02 PMUpdated Jul 12, 2024 | 3:02 PM
OTT Comedy Series : OTTలో కడుపుబ్బా నవ్వించే సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

గత కొంతకాలంగా ఓటీటీ లో చాలానే సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. కానీ అవన్నీ కూడా హర్రర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, లేదా ఒంటరిగా కూర్చుని చూసే సినిమాలే. ఇలాంటి జోనర్ సినిమాలను అందరూ ఇంట్రెస్టింగ్ గానే చూస్తారు. అయినా సరే, అందరితో కలిసి కూర్చుని చూసే కామెడీ మూవీస్ కోసం కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ లకు ఏ రేంజ్ లో ఆదరణ పెరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనితో ఇప్పుడు కామెడీ వెబ్ సిరీస్ లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతుంది. మరి ఈ వెబ్ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

కోలీవుడ్ లో టాప్ కమెడియన్ యోగిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు చాలా సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో మందిని.. తన నటనతో నవ్వించి మెప్పించాడు. ఇక ఇప్పుడు యోగి బాబు మెయిన్ లీడ్ లో తమిళంలో “చట్నీ సాంబార్” పేరుతో.. ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో.. ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ వెబ్ సిరీస్ నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. పైగా తమిళంతో పాటు తెలుగు, మలయాళం , కన్నడ భాషల్లో కూడా చట్నీ సాంబార్ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు మేకర్స్. అయితే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ విషయంలో అయితే ఇంకా క్లారిటీ లేదు కానీ.. ఈ వెబ్ సిరీస్ ను ఆగష్టు నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. కాబట్టి ఎంచక్కా ఫ్యామిలీ తో కలిసి కూర్చుని చూడడానికి త్వరలోనే ఇంట్రెస్టింగ్ సిరీస్ రానుంది.

ఇక చట్నీ సాంబార్ సిరీస్ కథ విషయానికొస్తే.. అముద కేఫ్ అనే హోటల్ చుట్టూ ఈ సిరీస్ కథ కొనసాగనుంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను గమనిస్తే.. అముద కేఫ్ లో సాంబార్ బాగా ఫేమస్ అన్నట్లుగా ఆ టీజర్ లో చూపించారు. ఇక యోగి బాబు రోడ్ సైడ్ ఇడ్లీలు అమ్ముకుంటు ఉంటాడు. అతని బండి దగ్గర చట్నీ బాగా ఫేమస్. తన చట్నీ సీక్రెట్ రెసిపీ ఎవరికీ తెలీకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు యోగిబాబు. అయితే ఓ సారి అముద కేఫ్ కష్టాల్లో ఉండడంతో.. ఆ కేఫ్ ఓనర్ కొడుకులు.. యోగి బాబుతో డీల్ కుదుర్చుకుంటారు. అతని చట్నీ రెసిపీ వారికి చెప్తే.. వారి హోటల్ లోని సాంబార్ రెసిపీ అతనికి చెప్తామని చెప్తారు. మరి ఈ డీల్ కుదుర్చుకునే సమయంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి ? ఆ తర్వాత ఏం జరిగింది ? అనేదే ఈ సిరీస్ కథ. మరి చట్నీ సాంబార్ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/