iDreamPost
android-app
ios-app

OTT లో చాందిని చౌదరి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

  • Published Jul 25, 2024 | 12:27 PMUpdated Jul 25, 2024 | 12:27 PM

Yevam OTT Streaming : చాందిని చౌదరి ఈ మధ్య కాలంలో ఈ హీరోయిన్ పేరు బాగా వినిపిస్తుంది. ఇటీవలే ఓటీటీ లో మ్యూజిక్ షాప్ మూర్తి మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలో ఈ అమ్మడు నటించిన మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపొయింది. ఆ మూవీ ఏంటో చూసేద్దాం.

Yevam OTT Streaming : చాందిని చౌదరి ఈ మధ్య కాలంలో ఈ హీరోయిన్ పేరు బాగా వినిపిస్తుంది. ఇటీవలే ఓటీటీ లో మ్యూజిక్ షాప్ మూర్తి మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలో ఈ అమ్మడు నటించిన మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపొయింది. ఆ మూవీ ఏంటో చూసేద్దాం.

  • Published Jul 25, 2024 | 12:27 PMUpdated Jul 25, 2024 | 12:27 PM
OTT లో చాందిని చౌదరి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ఇప్పుడు ఓటీటీ లో ముందస్తు ఇన్ఫర్మేషన్ తో కొన్ని.. సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ కొన్ని సినిమాలు.. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వారం ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సడెన్ గా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. చాందిని చౌదరి ఈ మధ్య కాలంలో ఈ హీరోయిన్ పేరు బాగా వినిపిస్తుంది. ఇటీవలే ఓటీటీ లో మ్యూజిక్ షాప్ మూర్తి మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలో ఈ అమ్మడు నటించిన మరొక ఇంట్రెస్టింగ్ మూవీ “యేవమ్”. ఇప్పుడు ఈ సినిమా కూడా ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపొయింది. మరి ఈ మూవీ ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులకు పరిచయం అయినా ఈ అమ్మడు.. కలర్ ఫోటో సినిమాతో ప్రేక్షకుల మదిలో మంచి ప్లేస్ సంపాదించుకుంది. ఈ క్రమంలో తనకు తగిన పాత్రలను ఎంచుకుంటూ. మంచి మంచి సినిమాలనే చేస్తుంది చాందిని చౌదరి. ఇక ఇప్పుడు ఫిమేల్ ఓరియెంటెడ్ రోల్ లో చేసిన మూవీనే యేవమ్. ఈ సినిమా జూన్ 14 న థియేటర్ లో రిలీజ్ అయ్యి.. యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల తర్వాత ఈ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ సొంతం చేసుకోగా.. జూలై 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి.. ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా ప్రకటించింది.

కాగా యేవమ్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చాందిని చౌదరితో పాటు… వశిష్ట సింహా, జైభారత్‌ , ఆషు రెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత లాంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే.. చాందిని చౌదరి వికారాబాద్ లోని పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఉద్యోగం చేస్తుంది. ఎవరు ఎన్ని మాటలు అన్నా కానీ పట్టించుకోకుండా తన పని తానూ చేసుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఓ అనుకోని పరిస్థితి ఎదురౌతుంది. ఎవరో ఒక అతను హీరోల పేర్లు చెప్పి ట్రాప్ చేస్తున్నాడని.. తెలుస్తుంది. ఓ సమయంలో మరో అమ్మాయికి బదులుగా చాందిని ఆ ప్లేస్ కు వెళ్తుంది. ఆ తర్వాత ఏమైంది ? ఆమె కేసును ఎలా సాల్వ్ చేసింది? అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి