iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్ కు పండగే.. ఈ వారం OTTలో అన్నీ తెలుగు సినిమాలే.. ఇవి మిస్ కావొద్దు!

  • Published Aug 09, 2024 | 4:39 PM Updated Updated Aug 09, 2024 | 4:39 PM

This Week Telugu OTT Releases : ఈ వారం ఓటీటీ లో సినిమాలన్నీ ప్రత్యేకమే.. సాధారణంగా మూవీ లవర్స్ అన్ని భాషల సినిమాలను చూసినా కూడా.. ముందుగా సెర్చ్ చేసేది మాత్రం తెలుగు సినిమాల కోసమే. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో చాలానే తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో చూసేద్దాం.

This Week Telugu OTT Releases : ఈ వారం ఓటీటీ లో సినిమాలన్నీ ప్రత్యేకమే.. సాధారణంగా మూవీ లవర్స్ అన్ని భాషల సినిమాలను చూసినా కూడా.. ముందుగా సెర్చ్ చేసేది మాత్రం తెలుగు సినిమాల కోసమే. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో చాలానే తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో చూసేద్దాం.

  • Published Aug 09, 2024 | 4:39 PMUpdated Aug 09, 2024 | 4:39 PM
మూవీ లవర్స్ కు పండగే.. ఈ వారం OTTలో అన్నీ తెలుగు సినిమాలే.. ఇవి మిస్ కావొద్దు!

ప్రతి వారం ఓటీటీ లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అలాగే ఈ వారం కూడా ఓటీటీ లో అన్నీ ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లే రిలీజ్ అయ్యాయి. అయితే మూవీ లవర్స్ అంత అన్ని సినిమాలను చూసినా కూడా.. ముందు సెర్చ్ చేసేది మాత్రం తెలుగు సినిమాల గురించే. ఈ మధ్య కాలంలో తెలుగు కంటెంట్ కు బాగా ఆదరణ పెరిగింది. ప్రతి వారం ఎదో ఒక తెలుగు సినిమా రిలీజ్ అవ్వడం , లేదా ఆల్రెడీ రిలీజ్ అయినా సినిమాలకు డబ్బింగ్ వెర్షన్స్ ను తీసుకురావడం లాంటివి చేస్తున్నారు మేకర్స్. ఈ క్రేయామంలో ఈ వారం ఓటీటీ లో చాలానే తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి అవేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో రిలీజ్ కాబోయే తెలుగు సినిమాలు ఏవంటే..

భారతీయుడు 2:

శంకర్ , కమల్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్యన జూలై 12 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. అనుకోని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి థియేటర్ లో ఈ మూవీని మిస్ అయినా ప్రేక్షకులు.. అసలు సినిమా ఎందుకు డిజాస్టర్ అయింది అని తెలుసుకోవడం కోసం అయినా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ది బర్త్ డే బాయ్:

సినిమా రిలీజ్ కు ముందే వెరైటీ ప్రమోషన్స్ , ట్రైలర్ తో సినిమాపై.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ ను క్రియేట్ చేసింది. ఇక థియేటర్ లో రిలీజ్ అయినా తర్వాత కూడా.. పాజిటివ్ టాక్ తోనే థియేట్రికల్ రన్ ను కంప్లీట్ చేసుకుని.. సడెన్ గా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి వెంటనే చూసేయండి.

బర్త్‌మార్క్ :

ఎంత వేరే లాంగ్వేజ్స్ లో సినిమాలను చూసినా కానీ అవి తెలుగులో చూస్తేనే.. మూవీ లవర్స్ కు ఆ మజా ఉంటుంది. ఈ క్రమంలో తమిళంలో సూపర్ సక్సెస్ సాధించిన బర్త్ మార్క్ అనే ఈ సినిమా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ లోకి అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

డి బ్లాక్:

ఈ సినిమా కూడా తమిళ డబ్బింగ్ వెర్షన్ నుంచి వచ్చినదే. ఈ సినిమా ముఖ్యంగా యూత్ ను బాగా మెప్పిస్తుంది. ఈ వీకెండ్ ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్. ఈ మూవీ ప్రస్తుతం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి వెంటనే చూసేయండి.

ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా:

2021 లో తాప్సి మెయిన్ లీడ్ లో నటించిన హసీన్ దిల్‌రుబా అనే సినిమాకు ఊహించని రెస్పాన్స్ లభించడంతో.. ఇప్పుడు ఆ సినిమాకు సిక్వెల్ గా.. ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఆగష్టు 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిక్వెల్ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

టర్బో :

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ఈ సినిమా.. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీనితో ఈ సినిమాను ఎలా అయినా ఓటీటీ లో చూడాలని ఫిక్స్ అయ్యారు మూవీ లవర్స్. వారి కోసమే ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. ఈ సినిమా ప్రస్తుతం సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఈ సినిమాలతో పాటు.. వన్ ఫాస్ట్ మూవ్ , లిటిల్ మిస్ రాథర్ , చందు ఛాంపియన్ సినిమాలు కూడా డబ్బింగ్ వెర్షన్స్ లో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ వీకెండ్ ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetgalabetHoliganbet