iDreamPost
android-app
ios-app

OTT Release: వీకెండ్‌ హవా.. నేడు ఒక్క రోజే OTTల్లో 9 సినిమాలు స్ట్రీమింగ్‌.. ఏవంటే

  • Published Jul 12, 2024 | 9:12 AM Updated Updated Jul 12, 2024 | 9:12 AM

OTT Movies List On July 12th: వీకెండ్‌ వచ్చిందంటే చాలు.. థియేటర్‌లోకి వచ్చే సినిమాలతో పాటు.. ఓటీటీల్లోకి వచ్చే మూవీలు, వెబ్‌ సిరీస్‌లు కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి ఈ వీకెండ్‌లో ఏకంగా 9 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి. ఆ వివరాలు..

OTT Movies List On July 12th: వీకెండ్‌ వచ్చిందంటే చాలు.. థియేటర్‌లోకి వచ్చే సినిమాలతో పాటు.. ఓటీటీల్లోకి వచ్చే మూవీలు, వెబ్‌ సిరీస్‌లు కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి ఈ వీకెండ్‌లో ఏకంగా 9 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి. ఆ వివరాలు..

  • Published Jul 12, 2024 | 9:12 AMUpdated Jul 12, 2024 | 9:12 AM
OTT Release: వీకెండ్‌ హవా.. నేడు ఒక్క రోజే OTTల్లో 9 సినిమాలు స్ట్రీమింగ్‌.. ఏవంటే

ఒకప్పుడు వీకెండ్‌ అంటే అదేనండి శుక్రవారం వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాలు ఏవి థియేటర్‌లోకి వస్తాయా అని ఆత్రుతగా ఎదురు చూసేవాళ్లు. శుక్రవారం తెల్లవారుజామునే థియేటర్‌ల వద్ద సందడి మొదలవుతుంది. ఇక స్టార్‌ హీరో సినిమా అయితే.. ఆ సందడి, హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అర్థరాత్రి నుంచే కటౌట్‌లు, గజ మాలలు, పాలాభిషేకాలు ఇలా పండగ వాతావరణం నెలకొని ఉండేది. మరి ఇప్పుడో కాలం మారింది. స్టార్‌ హీరో, భారీ బడ్జెట్‌ సినిమా అని కాదు.. బజ్‌ను బట్టి థియేటర్‌కు వెళ్తున్నారు. ఫస్ట్‌ డే.. ఫస్ట్‌ షో తర్వాత మౌత్‌ టాక్‌ బాగుంటే.. సినిమాకు వసూళ్లు పెరుగుతున్నాయి. లేదంటే.. ఎంత భారీ ప్రమోషన్స్‌ చేసినా.. వ్యర్థం అవుతున్నాయి. అందుకే ప్రస్తుత కాలంలో వీకెండ్‌ నాడు అనగా శుక్రవారం రోజున థియేటర్‌లోకి వెళ్లి సినిమా చూసే వారి కన్నా.. ఓటీటీల్లోకి వచ్చే మూవీల కోసం ఎదురు చూసే వారే అధికంగా ఉంటున్నారు.

ఇక నేడు మరో వీకెండ్‌ అనగా శుక్రవారం వచ్చింది. ఇవాళ ఒక్కరోజే ఓటీటీల్లోకి 9 సినిమాలు రాబోతున్నాయి. వీటిల్లో ఒక రెండు చిత్రాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. ఆ సంగతి అలా ఉంచితే.. ఇక ఈ శుక్రవారం నాడు.. థియేటర్‌లోకి వచ్చేస్తోన్న భారీ బడ్జెట్‌ సినిమా.. భారతీయుడు-2. సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఈ మూవీ జూలై 12న థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు టాలీవుడ్‌లో సారంగదరియా లాంటి చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. ఇక ఈ రోజు ఏ ఓటీటీల్లో ఏ ఏ సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి అంటే..

ఈ వీకెండ్‌లో విజయ్ సేతుపతి నటించిన హిట్ మూవీ మహారాజ, తెలుగు సినిమా జిలేబి ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. గతేడాది ఆగస్టులో విడుదలైన జిలేబి చిత్రం ఎట్టకేలకు సంవత్సరం తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ వీకెండ్‌లో సందడి చేయనున్నాయి. మరి ఏయే ఓటీటీలో ఏ సినిమాల్లో స్ట్రీమింగ్‌ కానున్నాయి అంటే..

నెట్‌ఫ్లిక్స్‌

  • మహారాజ (మూవీ) – జూలై 12
  • బ్లేమ్‌ ద గేమ్‌ (సినిమా) – జూలై 12
  • ఎక్స్‌ప్లోడింగ్‌ కిట్టెన్స్‌ (కార్టూన్‌ సిరీస్‌) – జూలై 12

హాట్‌స్టార్‌

  • అగ్నిసాక్షి (తెలుగు సిరీస్‌) – జూలై 12
  • షో టైమ్‌ (వెబ్‌ సిరీస్‌) – జూలై 12

ఆహా

  • జిలేబి- జూలై 13

జియో సినిమా

  • పిల్‌ (హిందీ మూవీ) – జూలై 12

సోనీలివ్‌

  • 36 డేస్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌) – జూలై 12

లయన్స్‌ గేట్‌ ప్లే

  • డాక్టర్‌ డెత్‌: సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) – జూలై 12

మనోరమ మ్యాక్స్‌

  • మందాకిని (మలయాళ మూవీ)- జూలై 12

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom