iDreamPost
android-app
ios-app

ఒకేరోజు OTT లోకి 9 సినిమాలు/ సిరీస్ లు.. ఆ 2 అస్సలు మిస్ కాకండి !

  • Published Jun 20, 2024 | 11:43 AM Updated Updated Jun 20, 2024 | 11:43 AM

Friday OTT Releases: వీకెండ్ వచ్చేస్తుంది అంటే ఏ ఏ సినిమాలను చూద్దామా అని ప్లాన్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. మరి ఈ వారం ఒకేరోజు ఓటీటీ లో సందడి చేయబోయే సినిమాలేంటో చూసేద్దాం.

Friday OTT Releases: వీకెండ్ వచ్చేస్తుంది అంటే ఏ ఏ సినిమాలను చూద్దామా అని ప్లాన్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. మరి ఈ వారం ఒకేరోజు ఓటీటీ లో సందడి చేయబోయే సినిమాలేంటో చూసేద్దాం.

  • Published Jun 20, 2024 | 11:43 AMUpdated Jun 20, 2024 | 11:43 AM
ఒకేరోజు OTT లోకి 9 సినిమాలు/ సిరీస్ లు..  ఆ 2 అస్సలు మిస్ కాకండి !

వీకెండ్ ఇంకా కొద్దీ రోజులు మాత్రమే ఉంది. మరి ఈ వీకెండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏ ఏ సినిమాలు సిద్ధంగా ఉన్నాయో.. వాటిలో ఏ సినిమాలు చూదగినవో కూడా ఆల్రెడీ లిస్ట్ వచ్చేసి ఉంటుంది. ఇక ఇప్పుడు సినిమాలను , సిరీస్ లను థియేటర్స్ కు వెళ్ళి చూసేవారి సంఖ్య కంటే కూడా .. ఎంచక్కా ఇంట్లో కూర్చుని ఓటీటీ లో చూసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. కాబట్టి ఓటీటీ లకు ఆదరణ బాగా పెరిగిపోయింది. దీనితో మేకర్స్ కూడా ప్రతి వారం మంచి మంచి సినిమాలనే ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి బాగానే ప్రయత్నిస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీ లో ఒకేరోజు ఏకంగా 9 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటో .. ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

మూవీ లవర్స్ కు శుక్రవారం అంటే పండగ.. ఎందుకంటే కేవలం శుక్రవారం మాత్రమే థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కేవలం థియేటర్స్ లోనే కాదు ఇప్పుడు ఓటీటీ లో కూడా శుక్రవారం రోజున చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. మరి ఈ శుక్రవారం ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాల జాబితా ఇలా ఉంది.

నెట్ ఫ్లిక్స్:

  • గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా(స్పానిష్ సిరీస్) – జూన్ 21
  • నడికర్ తిలకం (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 21
  • ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ సిరీస్) – జూన్ 21
  • ట్రిగ్గర్ వార్నిం గ్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 21

హాట్ స్టార్ :

  • బాక్ (తెలుగు డబ్బింగ్ మూవీ ) – జూన్ 21
  • బ్యాడ్ కాప్ (హిందీ సిరీస్) – జూన్ 21
  • ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 21

జియో సినిమా:

  • బిగ్ బాస్ ఓటీటీ (హిందీ రియాలిటీ షో) – జూన్ 21

ఆహా:

  • రసవతి – జూన్ 21

కాబట్టి ఈ వారం ఎంచక్కా ఈ సినిమాలను చూసి ఎంజాయ్ చేసేయండి.  వీటిలో చూడదగిన సినిమాలంటే .. తమన్నా , రాశిఖన్నా నటించిన బ్యాక్ సినిమా అసలు మిస్ చేయకుండా చూడొచ్చని చెప్పి తీరాలి. ఇక ఆ తర్వాత హిందీ రియాలిటీ షో బిగ్ బాస్ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. సో వీకెండ్ పూర్తయ్యేలోపు … ఇంకా కొన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు.   మరి వీకెండ్ అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap