iDreamPost
android-app
ios-app

OTT లోకి విక్రాంత్ మస్సీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సెక్టార్ 36’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Published Sep 09, 2024 | 1:51 PM Updated Updated Sep 09, 2024 | 1:51 PM

OTT Crime Thriller Movie - Sector 36: ఈ వారం ఓటీటీ లో చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఇక వీటిలో అసలు మిస్ కాకుండా చూడాల్సిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఉంది. మరి ఆ మూవీ ఏంటో ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Crime Thriller Movie - Sector 36: ఈ వారం ఓటీటీ లో చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఇక వీటిలో అసలు మిస్ కాకుండా చూడాల్సిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఉంది. మరి ఆ మూవీ ఏంటో ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Sep 09, 2024 | 1:51 PMUpdated Sep 09, 2024 | 1:51 PM
OTT లోకి విక్రాంత్ మస్సీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సెక్టార్ 36’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఓటీటీ లోకి ప్రతి వారం కొత్త కంటెంట్ వస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. అయితే ఎక్కువ మంది బాగా ఇంట్రెస్టింగ్ గా చూసే మూవీస్ ఏమైనా ఉన్నాయంటే క్రైమ్ థ్రిల్లర్ కథలు. ఇక ఇప్పుడు ఈ వారం అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలలో ఇలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా ఉంది. అది మరేదో కాదు 12th ఫెయిల్ సినిమాతో అందరిని మెప్పించిన విక్రాంత్ మస్సి నటించిన.. సెక్టార్ 36 మూవీ.. డైరెక్ట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ మూవీ కథేంటి.. ఏ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఆల్రెడీ ఇప్పటికే సెక్టార్ 36 మూవీ ట్రైలర్ ను చూసే ఉంటారు. 12th ఫెయిల్ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ పాత్రతో అందరిని మెప్పించిన విక్రాంత్.. ఈ సినిమాలో కంప్లీట్ గా డిఫరెంట్ రోల్ లో నటించారు. ఈ సినిమాలో విక్రాంత్ ఒక సీరియల్ కిల్లర్ పాత్రను పోషించారు. సెక్టార్ 36 సినిమాలో ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాను మ్యాడక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ కలిసి నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులకు.. సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తాజాగా దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి అసలు మిస్ కాకుండా చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో నిఠారి కేస్ ను సాల్వ్ చేయనున్నారు. అసలు ఈ నిఠారి కేస్ ఏంటో చూసేద్దాం. ఇండియన్ క్రైమ్ హిస్టరీలోనే .. ఈ నిఠారి కేస్ ఎంతో భయంకరమైనది. 2006 లో జరిగిన ఈ సంఘటన దేశం మొత్తాన్ని భయంతో వణికించింది. నోయిడా దగ్గరలో.. నిఠారి అనే ఊరిలో చాలా అస్తిపంజరాలు దొరికాయి. దీనితో అప్పట్లో ఈ విషయం అందరికి గుండెలు వణుకు పుట్టించింది. పైగా ఆ కేసును విచారించగా అవన్నీ అప్పటివరకు తప్పిపోయిన చిన్నారులవని కేసులో తేలింది. అంతే కాకుండా ఆ చిన్నారులపై లైంగిక దాడులు చేసి హత్య చేసినట్లు.. దర్యాప్తులో కనుగొన్నారు. అదే కేసును .. అప్పుడు జరిగిన సంఘటనలను.. ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారు. ఇక ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş