iDreamPost
android-app
ios-app

త‌మన్నా బాయ్ ఫ్రెండ్ కొత్త సినిమా! ‘సైర‌ట్’ ద‌ర్శ‌కుడితో!

  • Published Jun 12, 2024 | 7:20 PM Updated Updated Jun 13, 2024 | 10:06 AM

నటుడు విజయ్ వర్మ తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. కాగా, ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అలాగే ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల కానుంది.

నటుడు విజయ్ వర్మ తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. కాగా, ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అలాగే ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల కానుంది.

  • Published Jun 12, 2024 | 7:20 PMUpdated Jun 13, 2024 | 10:06 AM
త‌మన్నా బాయ్ ఫ్రెండ్ కొత్త సినిమా! ‘సైర‌ట్’ ద‌ర్శ‌కుడితో!

నటుడు ‘విజయ్ వర్మ’.. ఈపేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ పేరు వినగానే ముందుగా తమన్నా బాయ్ ఫ్రెండ్ గా అందరికి గుర్తుకు వస్తాడు. అయితే అంతలా వీరిద్దరీ పేరు ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది. పైగా ఎక్కడ చూసిన ఈ లవ్ బర్డ్స్ చెట్టపట్టాలేసుకుంటూ దర్శనిమిస్తు ఉంటారు. కానీ, ఇంత వరకు వీరి రిలేషన్ పై ఇద్దరిలో ఎవరు కూడా ప్రస్తావించకపోవడం గమన్హారం. ఇదిలా ఉంటే.. విజయ్ బాలీవుడ్ లో విలన్ గా , హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన నటనతో ఎన్నో సినిమాల్లో నటించి  మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే తెలుగులో ఈయన నాని ఎంసీఏ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా విజయ్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. కాగా, విజయ్ మట్కా కింగ్ అనే  సినిమాలో నటిస్తున్నాడు. ఇక అందులో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

ఇకపోతే ఆ సినిమాకు సైర‌త్ సినిమా ఫేం బ్లాక్ బస్టర్ మరాఠీ దర్శకుడు నాగరాజు మంజులే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే ఈ మూవీని ప్రస్తుతం చిత్రికరిస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రకటించింది. అలాగే త్వరలోనే ఈ మూవీ తమ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుందని ప్రకటించింది. ఈ సందర్భంగా  మట్కా కింగ్ సినిమా కు సంబంధించి విజ‌య్ వ‌ర్మ ఫ‌స్ట్ లుక్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈ చిత్రం ముంబై గ్యాంగ్‌స్ట‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న‌ట్లు చిత్ర ద‌ర్శ‌కుడు నాగరాజు మంజులే తెలిపాడు.

అలాగే మట్కా కింగ్  సినిమాను రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై గార్గి కులకర్ణి, ఆశిష్ ఆర్యన్, అశ్విని సిద్వానీలతో కలిసి సిద్ధార్థ్ రాయ్ కపూర్ నాగరాజ్ మంజులే నిర్మిస్తున్నారు. ఇక  సినిమాలో కృతిక కమ్రా, సాయి తంహంకర్, గుల్షన్ గ్రోవర్ సిద్ధార్థ్ జాదవ్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. మరి, ప్రస్తుతం మాట్క సినిమాకు సంబంధించి విజయ్ వర్మ ఫస్ట్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet