iDreamPost
android-app
ios-app

Netflix లో మిలియన్ వ్యూస్ తో రికార్డ్ బ్రేక్ చేస్తున్న ‘మహారాజ’ మూవీ

  • Published Aug 21, 2024 | 5:10 PM Updated Updated Aug 21, 2024 | 5:10 PM

Maharaja Movie Sets New Record In Netflix: ప్రతి వారం OTT లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో జూలై 12న ఓటీటీ లోకి వచ్చిన ఓ సినిమా ఇండియన్ ఫిల్మ్స్ లోనే అత్యధిక వీక్షణలు పొందిన సినిమాగా రికార్డు సృష్టించింది. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

Maharaja Movie Sets New Record In Netflix: ప్రతి వారం OTT లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో జూలై 12న ఓటీటీ లోకి వచ్చిన ఓ సినిమా ఇండియన్ ఫిల్మ్స్ లోనే అత్యధిక వీక్షణలు పొందిన సినిమాగా రికార్డు సృష్టించింది. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Aug 21, 2024 | 5:10 PMUpdated Aug 21, 2024 | 5:10 PM
Netflix లో మిలియన్ వ్యూస్ తో రికార్డ్ బ్రేక్ చేస్తున్న ‘మహారాజ’ మూవీ

ఓటీటీ లకు ఇప్పుడు పెరుగుతున్న క్రేజ్ గురించి తెలియనిది కాదు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా.. అటు ఇటుగా రెండు మూడు నెలలలోపే ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇక ఇలా వచ్చిన వాటిలో కథను బట్టి కొన్ని సినిమాలు.. స్ట్రీమింగ్ స్టార్ట్ అయినా కొద్దీ గంటల్లోనే మంచి వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి. అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు టాప్ 10 లిస్ట్ ను అందిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో జూలై 12 న ఓటీటీ లోకి వచ్చిన ఓ సినిమా.. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్స్ లో అత్యధిక వీక్షణలు పొందిన సినిమాగా రికార్డు సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ సినిమా మరేదో కాదు.. విజయ్ సేతుపతి కెరీర్ లోనే 50వ సినిమాగా.. రిలీజ్ కు ముందు నుంచే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాకు నిథిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతితో పాటు ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, అభిరామి, భారతి రాజా ప్రధాన పాత్రలలో నటించారు. తక్కువ అంచనాలతో థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూలై 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా చాలా వారాల పాటు టాప్ 10 ట్రెండింగ్ లో కొనసాగింది. ఇప్పటికి కూడా ఈ సినిమా ట్రెండింగ్ లో టాప్ 5 స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు ఈ మూవీ మరో కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇండియన్ ఫిల్మ్స్ లోనే అత్యధిక వీక్షణలు పొందిన సినిమాగా పేరు సంపాదించుకుంది. ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా 18.6 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. రానున్న రోజుల్లో వ్యూస్ ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. విజయ్ సేతుపతి తన భార్య చనిపోయిన తర్వాత.. చిన్న బార్బర్ షాప్ ను రన్ చేస్తూ.. తన కూతురితో కలిసి జీవిస్తూ ఉంటాడు. అంతా బాగానే సాగిపోతుంది అనుకునే క్రమంలో.. ఓ రోజు సడెన్ గా అతను పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. తనపై ఓ ముగ్గురు దాడి చేసి… లక్ష్మిని దొంగలించారని.. ఎలా అయినా దానిని వెతికి పట్టుకోవాలని చెప్తాడు. కానీ లక్ష్మి పోలికల గురించి మాత్రం సరిగా చెప్పడు. ఇంట్లో ఉండేది కేవలం అతను, అతని కూతురు మాత్రమే.. మరి ఈ లక్ష్మి ఎవరు? పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారా లేదా ? అతని భార్య ఎలా చనిపోతుంది ? చివరికి ఏమౌతుంది? అనేదే ఈ సినిమా కథ. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ సినిమా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. మరి ఈ సినిమాపై రికార్డ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom