iDreamPost
android-app
ios-app

OTT Comedy Movie: డైరెక్ట్ గా OTT లోకి మరో తెలుగు కామెడీ మూవీ.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వేస్తారు.

  • Published Jul 20, 2024 | 11:09 AM Updated Updated Jul 20, 2024 | 11:09 AM

ఓటీటీ లో ఇప్పుడు కామెడీ మూవీలకు కూడా క్రేజ్ బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా మరొక కామెడీ మూవీ డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓటీటీ లో ఇప్పుడు కామెడీ మూవీలకు కూడా క్రేజ్ బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా మరొక కామెడీ మూవీ డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 20, 2024 | 11:09 AMUpdated Jul 20, 2024 | 11:09 AM
OTT Comedy Movie: డైరెక్ట్ గా OTT లోకి మరో తెలుగు కామెడీ మూవీ.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వేస్తారు.

కొంతకాలంగా ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసే సినిమాలు తగ్గిపోయాయని చెప్పి తీరాలి. అన్ని యాక్షన్, రొమాన్స్ , హర్రర్ లేదా వాచ్ ఎలోన్ మూవీస్ ఏ వస్తున్నాయి. చక్కాగా ఫ్యామిలీ అంత కలిసి కూర్చుని చూసే సినిమాలంటే.. అవి కామెడీ మూవీస్ , ఎమోషనల్ డ్రామాస్ మాత్రమే. ఇక ఈ మధ్య ఓటీటీ లో కామెడీ మూవీస్ కు క్రేజ్ బాగా పెరిగిపోయింది. గత కొన్ని వారాలుగా కనీసం వారానికి ఒక కామెడీ మూవీ అయినా రిలీజ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ నేరుగా ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు.. “వీరాంజనేయులు విహార యాత్ర”. ఈ సినిమాకు సుధీర్ పుల్ల‌ట్ల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీడకోలా ఫేమ్ రాగ్ మయూర్ , ప్రియా వడ్లమాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ‘మా బేబీ కనిపించడం లేదు.. మీకేమైనా కనిపించిందా’ అంటూ.. అలాగే ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన నరేష్ ఏడుస్తూ పోస్ట్ చేసిన ఓ వీడియో.. ఇలా వెరైటీగా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ స్ట్రీమింగ్ డేట్ ను సదరు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ “అందరూ మెచ్చిన 90’s వెబ్ సిరీస్ తర్వాత మరో ఫ్యామిలీ డ్రామాకు సిద్ధంగా ఉండండి. తెలుగులో తొలి ఫ్యామిలీ రోడ్ ట్రిప్ మూవీ నుంచి ఫ్యామిలీ పోస్టర్ ను పరిచయం చేస్తున్నాం. ఈ అడ్వెంచర్ ఆగస్ట్ 14న ప్రారంభం అవుతుంది. కేవలం ఈటీవీ విన్ లోనే” అంటూ అనౌన్స్ చేసింది. కాబట్టి ఈ కామెడీ ఎంటర్టైనర్ త్వరలోనే ఓటీటీ లో సందడి చేయనుంది.

కాగా ఈ సినిమాలో నరేష్ తో పాటు.. కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇప్పటివరకైతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కానీ.. ట్రైలర్ కానీ రిలీజ్ కాలేదు. ఇక స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఎప్పుడు గొడవలు పడే ఓ ఫ్యామిలీ అంతా కలిసి.. పాత కాలం నాటి వ్యాన్ లో.. గోవా వెళ్లాలని అనుకుంటారు. ఈ క్రమంలో వెళ్లే దారిలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి.. అనేదే ఈ మూవీ స్టోరీ లైన్. సో ఒక రోడ్ ట్రిప్ తో నవ్వించడానికి రెడీ అయిపోతున్నారు మేకర్స్. కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ.. ఎంత మందిని మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişantikbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom