iDreamPost
android-app
ios-app

వీడియో: OTTని దున్నేస్తున్న యక్షిణి సిరీస్.. వేదిక పడిన కష్టం చూడండి!

Vedika- OTT Trending Yakshini Web Series: ప్రస్తుతం ఓటీటీలను యక్షిణి వెబ్ సిరీస్ షేక్ చేస్తోంది. ఈ ఫాంటసీ థ్రిల్లర్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ సిరీస్ కోసం వేదిక పడిన కష్టాన్ని ఈ వీడియో స్పష్టంగా చూడచ్చు.

Vedika- OTT Trending Yakshini Web Series: ప్రస్తుతం ఓటీటీలను యక్షిణి వెబ్ సిరీస్ షేక్ చేస్తోంది. ఈ ఫాంటసీ థ్రిల్లర్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ సిరీస్ కోసం వేదిక పడిన కష్టాన్ని ఈ వీడియో స్పష్టంగా చూడచ్చు.

వీడియో: OTTని దున్నేస్తున్న యక్షిణి సిరీస్.. వేదిక పడిన కష్టం చూడండి!

ప్రస్తుతం ఓటీటీని దున్నేస్తున్న వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది యక్షిణి వెబ్ సిరీస్ అనే చెప్పాలి. ఈ సిరీస్ ఎన్నో భారీ అంచనాలతో స్ట్రీమింగ్ కి వచ్చిన విషయం తెలిసిందే. వాటిని రెట్టింపు చేస్తూ ఓటీటీలో ఇప్పుడు ట్రెండింగ్ సిరీస్ గా కొనసాగుతోంది. చూసిన ఆడియన్స్ అంతా యక్షిణి సిరీస్ కి మంచి మార్కులు వేస్తున్నారు. అయితే ఈ సిరీస్ లో కథ మంచి బలం అని చెప్పాలి. ఆ తర్వాత ఈ సిరీస్ కి మెయిన్ పిల్లర్ వేదిక అనే చెప్పాలి. దాదాపుగా కథ మొత్తం వేదిక చేసిన మాయ పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మాయ అలకాపురికి దూరం కావడం.. శాపంతో అబ్బాయిలను చంపుతూ వెళ్లడం.. తర్వాత ప్రేమలో పడటం ఇలా చాలానే కథ ఉంటుంది. అయితే ఈ సిరీస్ కోసం వేదిక పడిన కష్టాన్ని ఒక రీల్ గా షేర్ చేసింది.

ఈ వెబ్ సిరీస్ లో వేదిక యక్షిణి పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో మనిషి రూపంలో ఉంటూ తన శాపనికి విరుగుడు కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. మనిషిని కా*మంతో లొంగదీసుకుని అతడి ప్రాణాలను తీయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఆమె యక్షిణిగా మారుతుంది. విడి సమయాల్లో మనిషిగానే ఉంటుంది. అయితే ఈ సిరీస్ ట్రైలర్ లో కూడా ఆమెను బులుగు రూపంలో కోపంగా.. క్రూరంగా చూపించారు. అలాంటి రూపాన్ని ఎక్కువగా సిరీస్లో చూపించలేదు.

యక్షిణి రూపం కోసం వేదిక చాలానే కష్టపడాల్సి వచ్చింది. అందుకే మేకప్ రూమ్ లో కూర్చుని ముఖం మొత్తం నీలి రంగు పూసుకుని గంటల కొద్దీ మేకప్ వేసుకుంది. అలాగే అప్పటి పరిస్థితులను ఫ్యాన్స్ కి చూపిస్తూ ఒక రీల్ అయితే షేర్ చేసింది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో వేదిక షేర్ చేసిన యక్షిణి మేకప్ రీల్ వైరల్ అవుతోంది. అంతేకాకుండా.. యక్షిణి సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతోంది. ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ అయితే లభిస్తోంది. యక్షిణి సిరీస్ లో అందరి యాక్టింగ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత మంచు లక్ష్మి కూడా యక్షిణిగా మంచి పాత్ర చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

వేదికకు సపోర్ట్ గా ఉంటూ.. తోటి యక్షిణిగా మంచు లక్ష్మి యాక్టింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే ఈ సిరీస్ లో విలన్ గా చేసిన అజయ్ యాక్టింగ్ కి నూటికి నూరు మార్కులు వేయచ్చు. నెగిటివ్ రోల్ అజయ్ చాలా అద్భుతంగా నటించాడు. ఒక మంచి రోల్ తో అభిమానులను అయితే ఎంటర్ టైన్ చేశాడు. మీరు ఇంకా యక్షిణి సిరీస్ చూడకపోతే మాత్రం కచ్చితంగా చూసేయండి. లేదంటే ఒక మంచి ఫాంటసీ థ్రిల్లర్ ని మిస్ అవుతారు. మీరు గనుక యక్షిణి సిరీస్ చూసుంటే.. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet