iDreamPost
android-app
ios-app

OTTలోకి బెస్ట్ మలయాళ, తమిళ, కన్నడ సినిమాలు! అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్!

  • Published Jun 18, 2024 | 5:31 PMUpdated Jun 18, 2024 | 5:31 PM

Telugu OTT Releases In June :దాదాపు ఈ నెలలో ఈ రెండు వారాలలో ఓటీటీ లో మంచి సినిమాలే వచ్చాయి. అయితే ఇంకా చూడాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

Telugu OTT Releases In June :దాదాపు ఈ నెలలో ఈ రెండు వారాలలో ఓటీటీ లో మంచి సినిమాలే వచ్చాయి. అయితే ఇంకా చూడాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

  • Published Jun 18, 2024 | 5:31 PMUpdated Jun 18, 2024 | 5:31 PM
OTTలోకి బెస్ట్ మలయాళ, తమిళ, కన్నడ సినిమాలు! అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్!

కేవలం హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలకే కాదు.. ఇప్పుడు సౌత్ సినిమాలకు కూడా డిమాండ్ బాగానే పెరిగింది. ఇప్పటికే ఈ వారం ఓటీటీ లో దాదాపు చాలా వరకు బెస్ట్ సినిమాలు , సిరీస్ లే రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ నెల ఆఖరి లోపు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు ఎన్నో సినిమాలు రెడీ గా ఉన్నాయి. తెలుగు సినిమాతో పాటు.. మలయాళం , తమిళం , కన్నడ భాషల్లో వచ్చిన సినిమాలన్నీ కూడా తెలుగులో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటివరకు రిలీజ్ అయినా సినిమాలను చూడడం ఫినిష్ చేసేస్తే.. ఇంకా మంచి మంచి సినిమాలు స్ట్రీమింగ్ సిద్ధం అయిపోతున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ, ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానున్నయో చూసేద్దాం.

ఆడు జీవితం :

దాదాపు ఓ నెల రోజులుగా అదిగో ఇదిగో అంటూ చాలానే ఈ సినిమా గురించి టాక్ వినిపిస్తుంది. కానీ సినిమా స్ట్రీమింగ్ డేట్ మాత్రం రావడం లేదు. కానీ, ఈ నెలలోనే డిస్ని ప్లస్ హాట్ స్టార్ లోకి రానున్నట్లు సమాచారం. మరి వస్తుందో లేదో వేచి చూడాలి.

అరణ్మనై 4 :

తమన్నా , రాశి ఖన్నా నటించిన కామెడీ హారర్ థ్రిల్లర్ .. సినిమా తెలుగులో బాక్ అనే పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమా అనుకున్న టైమ్ కే జూన్ 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళం తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కు రానుంది.

గరుడన్ :

ఇది ఒక తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా… ఈ సినిమా కూడా జూన్ 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.

గురువాయూర్ అంబలనాడయిల్:

కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు నటించిన ఈ సినిమా.. ఓ మలయాళ సినిమా. ఈ సినిమా మళయాళంతో పాటు.. తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. జూన్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

గం గం గణేశా :

ఆనంద్ దేవరకొండ నటించనిన ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజుల లోపే ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా ఈ నెలలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లోస్ట్రీమింగ్ కానుంది. కానీ ఇంకా డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు.

ఉయిర్ తమిజుక్కు:

2021 తమిళ రాజకీయాలను చూపించిన సినిమా ఇది. ఈ సినిమా జూన్ నెలలోనే స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. కానీ ఏ ప్లాట్ ఫార్మ్ కు వస్తుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. సో ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్, ప్లాట్ ఫార్మ్ కోసం ఇంకా వేచి చూడాల్సి ఉంది.

టర్బో:

మలయాళ స్టార్ హీరో నటించిన.. సస్పెన్స్ థ్రిల్లర్ టర్బో. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూన్ 28 నుంచి.. తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు అందుబాటులోకి రానుంది.

మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి