iDreamPost
android-app
ios-app

Turbo Movie OTT: OTT లోకి మమ్ముట్టి యాక్షన్ , కామెడీ మూవీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Jun 12, 2024 | 4:25 PM Updated Updated Jun 12, 2024 | 4:25 PM

ఓటీటీ లోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా కొద్దీ రోజులకు ఓటీటీ లో అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతుంది.

ఓటీటీ లోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా కొద్దీ రోజులకు ఓటీటీ లో అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతుంది.

  • Published Jun 12, 2024 | 4:25 PMUpdated Jun 12, 2024 | 4:25 PM
Turbo Movie OTT: OTT లోకి మమ్ముట్టి యాక్షన్ , కామెడీ మూవీ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ఓటీటీ ల హావ ఇంత బాగా పెరిగిపోతుందని ఎవరు ఊహించి ఉండరు. గతంలో సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన ఎప్పటికో ఓటీటీ లలో ప్రత్యేక్షం అయ్యేవి. దీనితో దాదాపు ప్రేక్షకులంతా థియేటర్స్ కు వెళ్లే సినిమాలను చూసేవారు. ఆ సినిమా ఓటీటీ లోకి వచ్చే వరకు కూడా.. ఆయా సినిమాలు ఓటీటీ లో ఉన్నాయని ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు అలా కాదు థియేటర్ లో సినిమా రిలీజ్ అయినా వెంటనే అవి ఏ ఓటీటీ లోకి వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన టర్బో మూవీ. ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద.. భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ సినిమాలో కన్నడ దర్శకుడు రాజ్ బీ శెట్టి , తెలుగు కమెడియన్ సునీల్ .. ప్రధాన పాత్రలలో నటించగా.. అంజనా జయప్రకాశ్, అమీనా నిజం, నిరంజనా అనూప్, కబీర్ దుహన్ సింగ్ కొన్ని ముఖ్య పాత్రలలో అలరించారు. ఈ సినిమా మే 23న థియేటర్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు దాదాపు థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని.. ఇప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతుంది.

Turbo Movie

టర్బో సినిమాకు థియేటర్ లో మంచి రెస్పాన్స్ రావడంతో.. ఓటీటీ డీల్ కూడా భారీ ధరకు ముగిసినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎలాగూ ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు పూర్తయింది కాబట్టి.. అనుకున్న దానికంటే ముందే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా 39 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. మరి ఈ సినిమా ఓటీటీ లో ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio