iDreamPost
android-app
ios-app

అఫీషియల్: మమ్ముట్టి యాక్షన్ థ్రిల్లర్ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా

  • Published Jul 31, 2024 | 10:49 AM Updated Updated Jul 31, 2024 | 10:49 AM

Turbo OTT Streaming Date: ఓటీటీ లో కొత్త సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయినా యాక్షన్ ఎంటర్టైనర్ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలు చూసేయండి.

Turbo OTT Streaming Date: ఓటీటీ లో కొత్త సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయినా యాక్షన్ ఎంటర్టైనర్ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలు చూసేయండి.

  • Published Jul 31, 2024 | 10:49 AMUpdated Jul 31, 2024 | 10:49 AM
అఫీషియల్: మమ్ముట్టి యాక్షన్ థ్రిల్లర్ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. తెలుగులో కూడా

ఇప్పుడు చాలా మంది ఓటీటీ లో సినిమాలను , సిరీస్ లను చూడడానికి అలవాటు పడిపోయారు. ఈ క్రమంలో ఓటీటీ లో ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ కు తగినట్లుగానే ప్రతి వారం ఓటీటీ లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇక వాటిలో ఏ సినిమాలు వీకెండ్ కు చూడదగిన సినిమాలు అనే లిస్ట్ కూడా వచ్చేస్తుంది. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ మమ్ముట్టి యాక్షన్ ఎంటర్టైనర్ ‘టర్బో ‘ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేయండి.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన సినిమా ‘టర్బో’ .. మే 23వ తేదీన థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఊహించని విధంగా థియేటర్స్ లో హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమాకు వైశాక్ దర్శకత్వం వహించారు. మిధున్ మాన్యుయెల్ థామస్ కథ.. స్వయంగా మమ్ముటినే ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు.. రాజ్ బీ శెట్టి , అంజన జయప్రకాశ్, షబరీష్ వర్మ, సునీల్, కబీర్ దుహాన్ సింగ్, నిరంజన అనూప్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. మళయాళంతో పాటు తెలుగు , హిందీ , తమిళం , కన్నడ భాషల్లో ఈ సినిమా.. ఆగష్టు 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ లో స్ట్రీమింగ్ కు రానుంది.

ఇక టర్బో సినిమా కథ విషయానికొస్తే.. మమ్ముట్టి ఈ సినిమాలో ఓ జీప్ డ్రైవర్ జోష్ పాత్రను పోషించాడు. ఇక జోష్ అనే అతను తన సొంత ఊరిలో క్రిస్టమస్ పండుగ సెలెబ్రేట్ చేసుకునేందుకు వస్తాడు. ఆ సమయంలో తన ఫ్రెండ్ జెర్రీ పై ఎవరో దాడి చేయగా జోష్ అతనిని కాపాడతాడు. ఇక జెర్రీ ఇందులేక అనే అమ్మాయితో అప్పటికే ప్రేమలో ఉంటాడు. కాబట్టి అందుకోసమే అతనిపై ఎవరో దాడి చేసి ఉంటారని గుర్తిస్తారు. దీనితో జోష్ వారిద్దరిని ఎలాగైనా కలపాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే ఇందులేఖని ఇంటి నుంచి తీసుకుని వచ్చేస్తాడు. తీరా తీసుకుని వచ్చాక ఆమె ఎవరో తెలియదంటాడు జెర్రీ. ఆ తర్వాత ఏమైంది అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis