iDreamPost
android-app
ios-app

OTT Bold Movie: చాలా ఫాస్ట్ గా OTT లోకి యానిమల్ బ్యూటీ బో*ల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Jul 29, 2024 | 6:06 PM Updated Updated Jul 29, 2024 | 6:08 PM

యానిమల్ మూవీ పుణ్యమా అని ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది త్రిప్తి డిమ్రి. ఈ క్రమంలో తాజాగా ఈ హీరోయిన్ నటించిన సినిమాకు రిలీజ్ కు ముందు విపరీతమైన బజ్ నడించింది. ఇక ఇప్పుడు అనుకున్న దానికంటే ముందే ఓటీటీ లోకి రానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

యానిమల్ మూవీ పుణ్యమా అని ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది త్రిప్తి డిమ్రి. ఈ క్రమంలో తాజాగా ఈ హీరోయిన్ నటించిన సినిమాకు రిలీజ్ కు ముందు విపరీతమైన బజ్ నడించింది. ఇక ఇప్పుడు అనుకున్న దానికంటే ముందే ఓటీటీ లోకి రానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 29, 2024 | 6:06 PMUpdated Jul 29, 2024 | 6:08 PM
OTT Bold Movie: చాలా ఫాస్ట్ గా  OTT లోకి యానిమల్ బ్యూటీ బో*ల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కు ముందు క్రియేట్ చేసిన హైప్.. ఎందుకో రిలీజ్ తర్వాత మెయింటైన్ చేయలేకపోతాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక సినిమా యాడ్ అయింది. యానిమల్ మూవీ పుణ్యమా అని ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది త్రిప్తి డిమ్రి. ఒక్క సినిమాతో.. బాగా పాపులర్ అయింది ఈ నటి. దీనితో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలో తాజా ఈ హీరోయిన్ నటించిన సినిమా ‘బ్యాడ్ న్యూజ్’. ఎందుకో తెలియదు కానీ.. ఈ మూవీ రిలీజ్ కు ముందు క్రియేట్ చేసిన హైప్.. థియేటర్ లో రిలీజ్ అయినా తర్వాత కొనసాగించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ అనుకున్నదానికంటే ముందే ఓటీటీ ఎంట్రీ ఇవ్వనుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

విక్కీ కౌషల్, అమీ విర్క్ , త్రిప్తి డిమ్రి కలిసి నటించిన బ్యాడ్ న్యూజ్ సినిమా..జూలై 19 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ, అనుకున్న రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి పది రోజులు అయినా కానీ ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా దాటలేదు. ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే.. ఇంకొక పదికోట్లకు పైనే కలెక్షన్స్ రాబట్టాల్సి ఉన్నట్లు టాక్. ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అయితే ఓటీటీ రూల్స్ ప్రకారం థియేటర్ లో రిలీజ్ అయినా ఏ సినిమా అయినా నెల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు రావాల్సి ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం నెల లోపే ఓటీటీ లోకి రానుంది. ఆగష్టు 16 లేదా 23 న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక బ్యాడ్ న్యూజ్ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో విక్కీ కౌశ‌ల్‌ ను త్రిప్తి డిమ్రి పెళ్ళి చేసుకుంటుంది. కానీ వారి మధ్య జరిగిన గొడవల కారణంగా.. కొద్దిరోజులకే వారిద్దరూ విడిపోతారు. ఈ క్రమంలో ఆమె అమీ విర్క్‌ తో రిలేషన్ లోకి వెళ్తుంది. కట్ చేస్తే వీరిద్దరిలో ఒకరి కారణంగా త్రిప్తి ప్రెగ్నెంట్ అయినట్లు.. ఆమెకు ట్విన్స్ పుట్టబోతున్నట్లు డాక్టర్స్ చెప్తారు. ఆ తర్వాత ఏమైంది ? వీరిద్దరిలో ఆమె ఎవరిని ప్రేమించింది? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరీ ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.