iDreamPost
android-app
ios-app

OTTలోకి మీర్జాపూర్ క్రియేటర్స్ బోల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Jul 10, 2024 | 5:00 AM Updated Updated Jul 10, 2024 | 5:00 AM

మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. దీనికి ఇప్పటికే రెండు సీజన్లు వచ్చాయి. ఈ వెబ్ సిరీస్ క్రియేటర్ల నుండి మరో వెబ్ సిరీస్ రాబోతుంది. ఇది కూడా బోల్డ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యింది.

మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. దీనికి ఇప్పటికే రెండు సీజన్లు వచ్చాయి. ఈ వెబ్ సిరీస్ క్రియేటర్ల నుండి మరో వెబ్ సిరీస్ రాబోతుంది. ఇది కూడా బోల్డ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యింది.

  • Published Jul 10, 2024 | 5:00 AMUpdated Jul 10, 2024 | 5:00 AM
OTTలోకి  మీర్జాపూర్ క్రియేటర్స్ బోల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్‌కు కేరాఫ్ అడ్రస్ అయ్యింది బాలీవుడ్ ఇండస్ట్రీ. ఓటీటీలో నియంత్రణ లేకపోవడంతో అడల్ట్ సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయి. కుటుంబంతో కలిసి చూడలేకపోయినప్పటికీ.. మూవీ ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుడం గమనార్హం. మీర్జాపూర్, లస్ట్ స్టోరీస్, రానా నాయుడు ఇలాంటి బోల్డ్ కంటెంబ్ సిరీస్‌లు తొలుత విమర్శలు పాలయ్యినప్పటికీ.. త్వరగా హయ్యెస్ట్ రేటింగ్ , రివ్యూతో దూసుకెళ్లాయి. వీటికి సీక్వెల్స్ రావడం కూడా కొసమెరుపు. ఇటీవల మీర్జాపూర్ 3 అలరిస్తోంది. దీనికి పునీత్ కృష్ణ, కరణ్ ఆయుస్మాన్ క్రియేటర్లుగా వ్యవహరించారు. ఇప్పడు వీరి నుండి వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ అయ్యింది. అదే త్రిభువన్ మిశ్రా: సీఏ టాపర్.

బోల్డ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది త్రిభువన్ మిశ్రా. ఇందులో టైటిల్ రోల్ లో నటిస్తున్నాడు మానవ్ కౌల్. తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్వేత బసు ప్రసాద్ ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. తిలోత్తమ షోమ్, ఫైజల్ మాలిక్, శుభ్రజ్యోతి భార్త, జితిన్ గులాటీ, అశోక్ పాఠక్, యామినీ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెబ్ సిరీస్‍ను రామ్ సంపత్, పునీత్ కృష్ణ, వినీత్ కృష్ణ నిర్మించారు. షోరన్నర్‌,క్రియేటర్‌గా పునీత్ వ్యవహిరిస్తున్నాడు. అమిత్ రాజ్ దర్శకుడు. సంపత్, అనురాగ్ సైకియా ఈ వెబ్ సిరీస్‌కు మ్యూజిక్ అందిస్తుండగా, అనూజ్ సంతానీ సినిమాటోగ్రఫీ చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాబోతుంది. డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుందని ట్రైలర్‌లో అధికారికంగా ప్రకటించారు.

జులై 18 నుండి అందుబాటులోకి రానుంది. అంటే వచ్చే వారమే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే.. టాప్ సీఏగా ఉండే త్రిభువన్.. తన క్లయింట్లలో కొంతమంది మహిళలతో శృంగరపరమైన సంబంధాలు పెట్టుకుంటాడు. వారిలో గ్యాంగ్ స్టర్ భార్య కూడా ఉంటుంది. ఓ సమయంలో దొరికిపోతాడు. అతడ్ని పట్టుకునేందుకు గ్యాంగ్ స్టర్ వెంటపడతాడు. వారి నుండి తప్పించుకుని తిరుగుతుంటాడు.. ఈ సీఏ టాపర్. ఈ ట్రైలర్ మొత్తం అడల్ట్ కంటెంట్, యాక్షన్ సీన్స్ కనిపిస్తున్నాయి. మరీ ఏ మేరకు ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకుంటుందో చూడాలంటే.. జులై 18 వరకు వేచి చూడాల్సిందే. ఇక ఇదే నిర్మాతల నుండి వచ్చిన మీర్జాపూర్ సీజన్ త్రీ గత వారమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకులుగా ఉన్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio