iDreamPost
android-app
ios-app

డైరెక్ట్ గా OTT లోకి వెరైటీ థ్రిల్లర్ మూవీ ‘విస్పోట్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే ?

  • Published Sep 03, 2024 | 2:30 AM Updated Updated Sep 05, 2024 | 12:46 PM

OTT New Releases- Thriller Movie Visfot: ఓటీటీ లోకి కొత్త సినిమాలు ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. అది కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లోకి వచ్చేస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

OTT New Releases- Thriller Movie Visfot: ఓటీటీ లోకి కొత్త సినిమాలు ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. అది కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లోకి వచ్చేస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 03, 2024 | 2:30 AMUpdated Sep 05, 2024 | 12:46 PM
డైరెక్ట్ గా OTT లోకి వెరైటీ థ్రిల్లర్ మూవీ ‘విస్పోట్’..  స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే ?

కేవలం తెలుగు సినిమాలను మాత్రమే చూస్తాం అని అనుకోకుండా.. మంచి కంటెంట్ ఉంటే చాలు అనుకుంటే మాత్రం.. ఓటీటీ లో లెక్కకు మించిన సినిమాలు , సిరీస్ లు ఉన్నాయి. ఇక ఈ మధ్య తెలుగు సినిమాలకు కూడా ఆదరణ బాగానే పెరుగుతుంది. అది అలా ఉంటే మరో వైపు కొత్త కంటెంట్ కూడా ఎప్పటికప్పుడు యాడ్ అవుతూనే ఉంది. అది కూడా ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కాన్సెప్ట్ తో వాటిని రూపొందిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ మధ్య డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోలు.. రితేష్ దేశ్‌ముఖ్, ఫర్దీన్ ఖాన్ కలిసి నటించిన ఓ సినిమా.. డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ రెండేళ్ల క్రిందట పూర్తైన కూడా.. అనేక కారణాల వలన ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఇక ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా పేరు విస్పోట్. కాగా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమాలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. సెప్టెంబర్ 6 ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ప్రకటించారు. అలాగే దీనికి సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ తెలుగులో అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

ఇక జియో సినిమా ప్లాట్ ఫార్మ్.. “రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఓ థ్రిల్లింగ్ ఎక్స్‌ప్లోజన్ కచ్చితంగా ఉంటుంది. విస్ఫోట్ మూవీ మీ జియో సినిమా ప్రీమియంలో సెప్టెంబర్ 6 నుంచి..” అనే క్యాప్షన్ తో ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు . కాగా ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. రెండు వేరు వేరు.. ప్రపంచంలోని ఇద్దరు అనుకోకుండా కలవడం వలన వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఇప్పటికే జియో సినిమా మంచి కాన్సెప్ట్స్ తో ఉండే సినిమాలను , సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తుంది. ఇక ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss