iDreamPost
android-app
ios-app

ఈ వారం OTTలో 4 తెలుగు సినిమాలు..మూవీ లవర్స్ కు పండగే

  • Published Sep 18, 2024 | 5:27 PM Updated Updated Sep 18, 2024 | 5:27 PM

This Week OTT Telugu Movies: ప్రతి వారం ఓటీటీ లో ఇరవైకి పైగా సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. వాటిలో ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉండడం విశేషం. మరి ఈ వారం ఓటీటీ లో రిలీజ్ కాబోయే తెలుగు సినిమాలేంటో చూసేద్దాం.

This Week OTT Telugu Movies: ప్రతి వారం ఓటీటీ లో ఇరవైకి పైగా సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. వాటిలో ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉండడం విశేషం. మరి ఈ వారం ఓటీటీ లో రిలీజ్ కాబోయే తెలుగు సినిమాలేంటో చూసేద్దాం.

  • Published Sep 18, 2024 | 5:27 PMUpdated Sep 18, 2024 | 5:27 PM
ఈ వారం OTTలో 4 తెలుగు సినిమాలు..మూవీ లవర్స్ కు పండగే

డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే అన్ని సినిమాలను కంటెంట్ బావుంటే.. సమానంగానే చూస్తారు. కానీ ఎందుకో ఒకింత తెలుగు సినిమాలంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీనితో మేకర్స్ కూడా గత కొన్ని వారాలుగా తెలుగు కంటెంట్ కే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఇతర భాషల చిత్రాలను తెలుగులో తీసుకురావడమే కాకుండా.. డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేసే తెలుగు సినిమాలు , సిరీస్ లు సంఖ్య కూడా పెరుగుతుంది. దీనితో అటు థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీ లో కూడా తెలుగు సినిమాల క్రేజ్ పెరుగుతుంది. మరి ఈ వారం ఓటీటీ లో రిలీజ్ కాబోయే తెలుగు సినిమాలేంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోయే తెలుగు సినిమాలు ఇవే..

మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం :

రావు రమేష్ నటించిన ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా ఆగష్టు 23న థియేటర్స్ లో రిలీజ్ అయింది. చిన్న సినిమాగా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ దాదాపు థియేటర్ లో అందరిని మెప్పించింది. రావు రమేష్ తో పాటు.. ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి లాంటి ఎంతో మంది ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఇప్పుడు నెల లోపే ఓటీటీ లో అడుగుపెట్టనుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

తిరగబడరా సామీ:

ఆల్రెడీ ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేశాడు. వాటిలో ఏ ఒక్కటైనా రాజ్ తరుణ్ కు హిట్ ఇస్తుందేమో అని అనుకున్నాడు కానీ. ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ క్రమంలోనే ఆగస్ట్ 2న థియేటర్ లో తిరగబడరా సామి మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా మిక్స్డ్ తోనే థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లో అడుగుపెట్టేందుకు రెడీ అయిపోయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.

సోపతులు:

ఈ మధ్య కాలంలో నేరుగా ఓటీటీ లోకి వచ్చే సినిమాల సంఖ్య పెరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఇలా వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి టాక్ నే సంపాదించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ బ్యాక్డ్రాప్ లో.. ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ రాబోతుంది. కచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరికి వారి బాల్యాన్ని గుర్తుచేస్తుందని చెప్పి తీరాల్సిందే. ఈ సినిమా పేరు సోపతులు. ఈటీవీ విన్ ఒరిజినల్స్ గా ఈ మూవీ నేరుగా ఓటీటీ లోకి రాబోతుంది. ఈ వీకెండ్ ఈ మంచి ఫీల్ గుడ్ తెలుగు మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్.

ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్:

తెలుగులో సినిమాలు మాత్రమే కాదు, వెబ్ సిరీస్ లు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటూ ఉంటాయి. ఇప్పటివరకు డైరెక్ట్ గా తెలుగులో రిలీజ్ అయినా వెబ్ సిరీస్ లన్నీ కూడా మంచి టాక్ నే సంపాదించుకున్నాయి. ఇక ఇప్పుడు ఓ హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతుంది . అదే ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. కాగా ఈ సిరీస్ కు అనీస్ కురువిళ్ళ దర్శకత్వం వహించగా.. తేజస్వి మదివాడ, నందు, పావని రెడ్డి, అషుతోష్ రానా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

ఇక ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరిన్ని తెలుగు సినిమాలు యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap