iDreamPost
android-app
ios-app

Netflixలో మహారాజ చూశారు ఓకే ! ఇంకో బెస్ట్ మూవీ ఉంది మిస్ అయ్యారా?

  • Published Jul 23, 2024 | 5:37 PM Updated Updated Jul 23, 2024 | 5:37 PM

Netflix Trending Movies: ప్రతి వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో అనే లిస్ట్ తో పాటు.. ఏ సినిమాలకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఏ సినిమాలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అనే లిస్ట్ కూడా వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు కాస్త స్పెషల్.

Netflix Trending Movies: ప్రతి వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో అనే లిస్ట్ తో పాటు.. ఏ సినిమాలకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఏ సినిమాలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అనే లిస్ట్ కూడా వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు కాస్త స్పెషల్.

  • Published Jul 23, 2024 | 5:37 PMUpdated Jul 23, 2024 | 5:37 PM
Netflixలో మహారాజ చూశారు ఓకే ! ఇంకో బెస్ట్ మూవీ ఉంది మిస్ అయ్యారా?

ప్రస్తుతం ప్రతి వారం పదికి పైగా సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విశేష ఆదరణను సంపాదించుకుంటున్నాయి. ఇక కొన్ని సినిమాలు ఇలా ఓటీటీ లో అడుగుపెడుతున్నాయో లేదో అలా ట్రెండింగ్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ లో ప్రతి వారం ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే అప్ డేట్స్ తో పాటు.. ఏ సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయి అనే లిస్ట్ కూడా వస్తూనే ఉంది. అలా ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ లో ఏ ఏ సినిమాలు టాప్ 10 ట్రెండింగ్ వ్యూస్ తో కొనసాగుతున్నాయని అని చూసే ఉంటారు. అయితే ఈ వారం మాత్రం కాస్త స్పెషల్ టాప్ 1 లో ఇంకా అదే సినిమా కొనసాగుతూ ఉండగా.. టాప్ 4,6,7,10 స్థానాలలో మాత్రం ఒకటే సినిమా ట్రెండింగ్ లో కొనసాగుతూ ఉండడం విశేషం. మరి ఆ సినిమా ఏంటో.. ఆ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో టాప్ 1 ట్రెండింగ్ లో రెండు వారలా నుంచి ఒకటే సినిమా కొనసాగుతుంది ఉంది. అదే మహారాజ మూవీ.. తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన మహారాజ మూవీ.. స్ట్రీమింగ్ మొదలైన మూడురోజుల్లోనే టాప్ 1 స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా ఇంకా ట్రెండింగ్ లోనే కొనసాగడం విశేషం. ఈ సినిమాలోనే ట్విస్ట్ లకు ఆడియన్స్ ఫిదా అయిపోయారని చెప్పి తీరాల్సిందే. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ లో విడుదలైన మహారాజ మూవీని ప్రేక్షకులు.. ఊహించని రేంజ్ లో హిట్ చేశారు. ఈ సినిమా మొదటి సీన్ నుంచి చివరి వరకు కూడా తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠతో కొనసాగుతూ ఉంటుంది. ఏముందిలే తర్వాత ఇలానే జరిగి ఉంటుందిలే అని ప్రేక్షకులు అనుకున్న ప్రతి సారి.. ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ కు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అవుతుంది. లక్ష్మి కనపడంలేదని ఓ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన హీరోకు చివరికి లక్ష్మిని దొంగలించిన వాడు దొరుకుతాడా.. లేదా తాను వెతుకుతున్న వాడు దొరుకుతాడా? అసలు లక్ష్మి ఎవరు హీరో దేని కోసం ఆ కంప్లైంట్ ఇస్తాడు ? చివరికి జరిగే ట్విస్ట్ అయితే ఎవరి ఊహకు అందదు. దాదాపు ఈ సినిమాను అందరు చూసే ఉంటారు. కానీ ఇంకా ఎవరైనా ఈ సినిమాను లైట్ తీసుకుంటే మాత్రం వెంటనే చూసేయండి.

ఇక టాప్ 4,6,7,10 స్థానాల్లో ఒకే సినిమా ట్రెండ్ లో కొనసాగడం బహుశా ఇదే మొదటి సారి అయ్యి ఉంటుంది. ఆ సినిమా మరేదో కాదు.. “ది గోట్ లైఫ్ :ఆడు జీవితం” . దాదాపు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయం అందరు మర్చిపోయారు అనుకునే సమయానికి.. అనేక సార్లు పోస్ట్ పోన్ అవుతూ.. ఆఖరికి గత వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది ఈ సినిమా. రిలీజ్ అవ్వడమే కాకుండా.. కేవలం మూడు నాలుగు రోజుల్లోనే.. ఒకేసారి అన్ని భాషల్లో.. హిందీ , తెలుగు , తమిళ్ , మలయాళ ట్రెండింగ్ లో నిలవడం విశేషం. ప్రతి ఒక్కరు తప్పకుండ చూడాల్సిన సినిమా ఇది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఇక ఈ రెండు సినిమాలతో పాటు.. రెండో స్థానంలో వైల్డ్ వైల్డ్ పంజాబ్, మూడో స్థానంలో శ్రీకాంత్ , ఐదో స్థానంలో మహారాజ్ , 8వ స్థానంలో రాంపేజ్, 9వ స్థానంలో అన్‌చార్టెడ్ సినిమాలు కొనసాగుతున్నాయి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss