iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో మిస్ కాకుండా చూడాల్సిన 3 సినిమాలు ఇవే..

  • Published Jun 18, 2024 | 12:19 PM Updated Updated Jun 18, 2024 | 12:23 PM

This Week Must Watch Movies In OTT: ప్రతి వారం ఓటీటీ లో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. మరి ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అయినా సినిమాలలో ఏ సినిమాలు వీకెండ్ కు బెస్ట్ ఛాయస్ అనే విషయాలను చూసేద్దాం.

This Week Must Watch Movies In OTT: ప్రతి వారం ఓటీటీ లో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. మరి ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అయినా సినిమాలలో ఏ సినిమాలు వీకెండ్ కు బెస్ట్ ఛాయస్ అనే విషయాలను చూసేద్దాం.

  • Published Jun 18, 2024 | 12:19 PMUpdated Jun 18, 2024 | 12:23 PM
ఈ వారం OTT లో మిస్ కాకుండా చూడాల్సిన 3 సినిమాలు ఇవే..

ఓ రకంగా చెప్పాలంటే.. ప్రేక్షకులు ఓటీటీ మూవీస్ కు అడిక్ట్ అయిపోయారని చెప్పి తీరాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఓటీటీ లో కొత్త సినిమాలు వస్తాయా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మేకర్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో గత వారం రిలీజ్ అయినా సినిమాల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత వారం ఓటీటీ లో మంచి ఎంటర్టైన్మెంట్ లభించిందని చెప్పి తీరాలి. ఇక ఇప్పుడు ఈ వారం కూడా స్ట్రీమింగ్ కు సిద్ధంగా చాలానే సినిమాలు, సిరీస్ లు రెడీ అయిపోతున్నాయి. మరి వాటిలో ఈ వారం చూడదగిన సినిమాలేంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

స్ట్రీమింగ్ సిదంగా ఉన్న సినిమాలైతే చాలానే ఉన్నాయిలే కానీ.. వాటిలో చెప్పుకోదగిన సినిమాలు మాత్రం కేవలం కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ సినిమాల విషయాలు ఇలా ఉన్నాయి.

కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 :

ఈ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది స్టూడెంట్స్ పడుతున్న మానసిక ఆందోళలను ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్. ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుని .. ఇప్పుడు మూడవ సీజన్ రాబోతుంది. మరి ఈ సారి ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. ఈ సిరీస్ జూన్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

బాక్ :

తెలుగు హర్రర్ కామెడీ చిత్రాల ఫ్రాంచైజీ లో అరణ్మనై సిరీస్ ఎంతో అద్భుతంగా అందరిని ఆకట్టుకుంది. ఈ ఫ్రాంచీజిలో భాగంగా వచ్చినదే.. ఈ అరణ్మణై 4, తెలుగులో బాక్. తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన సినిమా కోసం .. ఓటీటీ మూవీ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ సినిమా జూన్ 21 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది.

నడికర్ తిలకం :

ఇది ఒక తమిళ భాషలో వచ్చిన కామెడీ జోనర్ కు సంబంధించిన సినిమా. ఈ మధ్య కాలంలో కామెడీ సినిమాలు వచ్చి చాలా కాలమే అయింది. కాబట్టి సరదాగా కాసేపు నవ్వుకోడానికి ఈ సినిమాను చూసేయొచ్చు. పైగా ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ కాబోతున్నది. తెలుగు వెర్షన్ ఏ కాబట్టి ఇంకాస్తా ఫ్రీ గా ఈ సినిమాను చూసేయొచ్చు. ఈ సినిమా జూన్ 21 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ప్రస్తుతానికైతే ఇప్పటివరకు ఓటీటీ లో వచ్చిన స్ట్రీమింగ్ వివరాల ప్రకారం… ఈ సినిమాలు చూడదగినవి. వీకెండ్ లోపు ఇంకా ఏమైనా కొత్త సినిమాలు వచ్చిన రావొచ్చు. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetjojobetCasibom girişjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin