Krishna Kowshik
టాలెంట్ అండ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమర్పణలో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే...?
టాలెంట్ అండ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమర్పణలో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే...?
Krishna Kowshik
వర్సటైల్ అండ్ టాలెంట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడిగా, నటుడిగా, టీవీ ప్రజెంటర్‌గా తనను తానూ ప్రూవ్ చేసుకుంటున్నాడు. డైరెక్షన్ తప్ప అన్నీ చేస్తాడన్న అపవాదు ఉంది తరుణ్ విషయంలో. ఆయన సినిమాలో హీరోలు ఉండరు.. పాత్రలే మాట్లాడుతుంటాయి. పెళ్లి చూపులు దగ్గర నుండి నిన్న వచ్చిన కీడా కోలా వరకు ఇదే ప్రూవ్ అయ్యింది. యూత్‌ను ఆకట్టుకునే డైలాగ్స్, నేరేషన్‌తో తరుణ్ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ నగరానికి ఏమైంది అయితే.. ఇక వేరే లెవల్ అంతే. ఈ సినిమా రీ రిలీజ్ చేస్తే థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. ఇప్పుడు ఆయన సమర్పణలో తులసీవనం అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. దీనికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది.
రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్, ఐశ్వర్య, వెంకటేష్ కాకుమాను, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించారు. లవ్ అండ్ రొమాంటిక్ కామెడీతో పాటు క్రికెట్ నేపథ్యంతో సినిమా సాగుతున్నట్లు ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమౌతుంది. ఈ చిత్రానికి అనిల్ రెడ్డి దర్శకుడు. యూత్ ఫుల్ స్టోరీని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. ఇక ట్రైలర్ చూస్తుంటే ఆసాంతం నవ్వులు పూయిస్తుంది. ‘జనరల్‌గా మైండ్‌కి క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా అని ఇట్ల అనగానే అట్ల జరిగిపోతాయి’ అంటూ అక్షయ్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. చివరిలో ‘చెన్నై ఎప్పుడైనా ఓడిపోవడం చూసిన వారా.. అది ఆర్సీబీపై సాలా కప్ నమ్ దే’ అనే డైలాగ్ ఆకట్టుకుంది. మొత్తానికి ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.
ఇక ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. ఓటీటీ హక్కులను ఈటివీ విన్ సొంతం చేసుకుంది. మార్చి 21 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈటీవీ విన్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ పడినట్లేనని ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతుంది. ప్రీతమ్ దేవిరెడ్డి, నిలిత్ పైడిపల్లి, సాయి కృష్ణ గద్వాల్, సాయి జాగర్లమూడి, జీవన్ కుమార్, అనిల్ రెడ్డి.. ఈ వెబ్ సిరీస్‌కు నిర్మాతలుగా వ్యవహరించారు. స్మరణ్ నేపథ్య సంగీతం అందించాడు. ప్రేమ్ సాగర్ కెమెరా పనితనం బాగుంది. మొత్తానికి ట్రైలర్ తులసీవనంపై చాలా క్యురియాసిటీని పెంచింది. ఇక ఈ వెబ్ సిరీస్ చూడాలంటే.. మార్చి 21 వరకు ఆగాల్సిందే.