Thangalaan Movie OTT Partner Is Netflix: చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ మూవీ వచ్చేది ఆ OTTలోకే!

చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ మూవీ వచ్చేది ఆ OTTలోకే!

Thangalaan Movie OTT Partner Details: చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘తంగలాన్’. పంద్రాగస్టు కానుకగా గురువారం థియేటర్లలోకి వచ్చేసిందీ మూవీ.

Thangalaan Movie OTT Partner Details: చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘తంగలాన్’. పంద్రాగస్టు కానుకగా గురువారం థియేటర్లలోకి వచ్చేసిందీ మూవీ.

కోలీవుడ్ నటుల్లో చియాన్ విక్రమ్​కు తెలుగు నాట కూడా మంచి క్రేజ్ ఉంది. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’, ‘ఐ’ లాంటి చిత్రాలతో టాలీవుడ్ ఆడియెన్స్​ మనసుల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. డిఫరెంట్, డేరింగ్ క్యారెక్టర్స్​లో నటిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని ఆయన థ్రిల్ చేస్తుంటారు. అలాంటి విక్రమ్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ ‘తంగలాన్’. విభిన్నమైన పాత్రల్లో కనిపించే విక్రమ్ నటిస్తుండటం, మనసును కదిలించే కథలతో చిత్రాలు తీసే పా రంజిత్ డైరెక్షన్ వహించడంతో ‘తంగలాన్’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా టాక్ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? లాంటి అంశాలతో పాటు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అనేది తెలుసుకునేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాని గురించి ఇప్పుడు చూద్దాం..

విక్రమ్ ఓ ఆటవిక తెగ మనిషిగా కనిపించడంతో ‘తంగలాన్’పై హైప్ బాగా పెరిగింది. మామూలు పాత్రల్లోనే ఇరగదీస్ ఈ హీరో అందులో ఇంకా ఏ రేంజ్​లో నటించి ఉంటాడోనని ప్రేక్షకులు ఊహించుకుంటున్నారు. బ్రిటీష్ కాలం నాటి కథతో సాగడం, బంగారం అన్వేషణ, కోలార్ గనుల నేపథ్యంతో వస్తుండటంతో ‘తంగలాన్’ డిఫరెంట్​ ఫిల్మ్ అవుతుందని అనుకుంటున్నారు. అందునా వైవిధ్యమైన సినిమాలతో పేరు తెచ్చుకున్న పా రంజిత్ తెరకెక్కించడంతో ఫిల్మ్ నెక్స్ట్ లెవల్​లో ఉంటుందని భావిస్తున్నారు. ఈ తరుణంలోనే మూవీ టాక్​తో పాటు ఓటీటీ డీటెయిల్స్ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘తంగలాన్’ ఓటీటీ పార్ట్​నర్ ఎవరో తెలిసిపోయింది. నెట్​ఫ్లిక్స్​లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ ఓటీటీ రైట్స్​ను ప్రముఖ సంస్థ నెట్​ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. అయితే ఈ ఫిల్మ్ డిజటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే సినిమా ఇవాళే రిలీజైంది. నెట్​ఫ్లిక్స్​తో ‘తంగలాన్’ మేకర్స్ చేసుకున్న ఒప్పందం, అలాగే థియేట్రికల్ రన్​ను బట్టి మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనేది డిసైడ్ చేస్తారు. ప్రొడక్షన్ హౌజ్ లేదా ఓటీటీ పార్ట్​నర్ నుంచి అఫీయిల్ అనౌన్స్​మెంట్ వస్తే గానీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనేది చెప్పలేం. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఇక, ‘తంగలాన్’ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ పలు అడ్డంకులు ఏర్పడటంతో వాటిని అధిగమించి ఆగస్టు 15న విడుదలైంది. మరి.. విక్రమ్ కొత్త మూవీని మీరు చూశారా? మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments