iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా OTT లోకి తెలుగు హిస్టరీ డ్రామా ‘సురాపానం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

  • Published Sep 19, 2024 | 1:03 PM Updated Updated Sep 19, 2024 | 1:03 PM

OTT Telugu Movie- Suraapanam: ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీ లోకి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు హిస్టారికల్ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది . మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Telugu Movie- Suraapanam: ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీ లోకి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు హిస్టారికల్ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది . మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Sep 19, 2024 | 1:03 PMUpdated Sep 19, 2024 | 1:03 PM
సైలెంట్ గా OTT లోకి తెలుగు హిస్టరీ డ్రామా ‘సురాపానం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ఓటీటీ లో చాలా వరకు సినిమాలన్నీ కూడా ముందస్తు ఇన్ఫర్మేషన్ తోనే స్ట్రీమింగ్ కు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో రిలీజ్ కానున్న తెలుగు సినిమాలు తక్కువ కావడంతో కాస్త అప్ సెట్ అయ్యారు ప్రేక్షకులు. ఈ క్రమంలో వారిని సర్ప్రైజ్ చేసేందుకు.. సైలెంట్ గా ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమా వచ్చేసింది. హిస్టారికల్ బ్యాక్డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా పేరు ‘సురాపానం’. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు థియేటర్ లో ఆడకపోయినా కూడా ఓటీటీ లో మాత్రం దుమ్ము దులిపేస్తున్నాయి. అలాంటి సినిమాలో లిస్ట్ లో ఈ సినిమాను కూడా యాడ్ చేసేయొచ్చు. మరి ఈ మూవీ ఎక్కా స్ట్రీమింగ్ అవుతుందో. ఈ మూవీ కథేంటో చూసేద్దాం.

ఈ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన మూవీ.. కొత్త సినిమా అయితే కాదు. ఈ మూవీ రిలీజ్ అయ్యి సుమారు రెండేళ్లు అయింది. ఈ సినిమాకు సంపత్ దర్శకత్వం వహించాడు. దర్శకత్వం వహించడంతో పాటు అతనే హీరోగా కూడా నటించడం విశేషం. ఇక సంపత్ కు జోడిగా ప్రగ్యా నయన్ నటించింది. వీరితో పాటు అజయ్ ఘోష్, సూర్య, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర, విద్యాసాగర్, అంజి బాబు, మాస్టర్ అఖిల్ లాంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. 2022 లో రిలీజ్ అయినా ఈ సినిమా థియేటర్ లో మిక్స్డ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ఆల్రెడీ ఈ మూవీ ఆహాలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వీకెండ్ ఓ మంచి తెలుగు ఫాంటసీ థ్రిల్లర్ చూడాలంటే మాత్రం ఈ మూవీ బెస్ట్ ఛాయిస్.

ఇక ఈ మూవీ కథ విషయానికొస్తే.. శివ అనే వ్యక్తి ఓ చిన్న పల్లెటూరిలో చిల్లర దొంగతనాలు చేసుకుంటూ.. ఫ్రెండ్స్ తో జాలిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మల్లన్న అనే ఓ వ్యక్తి అతనికి ఓ మైన్ తవ్వే భాద్యత అప్పగిస్తాడు. ఆ తవ్వకాల్లో అతనికి శివుని ప్రతిమతో ఉన్న ఓ బాక్స్ దొరుకుతుంది. అదే బాక్స్ లో చిన్న సీసాలో ఎదో లిక్విడ్ కూడా ఉంటుంది. దీనితో శివ ఆ లిక్విడ్ ను తాగేస్తాడు. ఇంతలోనే అనుకోకుండా ఆ విగ్రహం మిస్ అవుతుంది. అసలు ఆ సీసాలో లిక్విడ్ తాగిన తర్వాత శివకు ఏమైంది ? శివుని విగ్రహం ఎలా మాయమైంది ? ఆ తర్వాత శివ ఎదుర్కున్న సమస్యలేంటి ? ఆ తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swapholiganbet giriş