iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చేస్తున్న హర్రర్ కామెడీ మూవీ ‘OMG’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

  • Published Aug 14, 2024 | 3:10 PM Updated Updated Aug 14, 2024 | 3:10 PM

OTT Telugu Horror Comedy Movie: హర్రర్ మూవీస్ ఇప్పుడు అందరిని మెప్పించేస్తున్నాయి. అందులోను అవి తెలుగులో ఉంటే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు.. ఈ క్రమంలో ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు హర్రర్ మూవీ వచ్చేస్తుంది. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

OTT Telugu Horror Comedy Movie: హర్రర్ మూవీస్ ఇప్పుడు అందరిని మెప్పించేస్తున్నాయి. అందులోను అవి తెలుగులో ఉంటే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు.. ఈ క్రమంలో ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు హర్రర్ మూవీ వచ్చేస్తుంది. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

  • Published Aug 14, 2024 | 3:10 PMUpdated Aug 14, 2024 | 3:10 PM
OTT లోకి వచ్చేస్తున్న హర్రర్ కామెడీ మూవీ ‘OMG’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

హర్రర్ మూవీస్ ప్రేక్షకులను ఇట్టే మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఓటీటీ లో చాలానే హర్రర్ సినిమాలు రిలీజ్ అవ్వడం చూస్తూనే ఉన్నాము. అలాగే వాటికి లభించే ఆదరణ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. పైగా వీటిలో కామెడీ హర్రర్ సినిమాలకు స్పెషల్ డిమాండ్ ఉంటుంది. ఈ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని.. మేకర్స్ తెలుగులో కూడా కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్ లో రిలీజ్ అయినా ఇంట్రెస్టింగ్ హర్రర్ కామెడీ మూవీ.. ఓఎంజీ ఇప్పుడు ఓటీటీ లోకి రాబోతుంది. మరి ఈ మూవీ ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

వెన్నెల కిషోర్, షకలక శంకర్, నందిత శ్వేత కలిసి నటించిన ఓఎంజీ( ఓ మంచి ఘోస్ట్) మూవీ.. థియేటర్ లో రిలీజ్ అయినా 8 వారాల తర్వాత ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. థియేటర్ లో ఈ సినిమాకు.. ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కాగే ఈ సినిమాకు శంకర్ కే మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయిపోతుంది. ఈ సినిమా ఆగష్టు 15 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మధ్య ఎలాగూ థియేటర్ లో హిట్ కానీ చిత్రాలు.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతున్నాయి కాబట్టి.. ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందేమో.. వేచి చూడాలి.

OMG Movie

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక బంగ్లాలో ఉండే దెయ్యం, అదే ప్లేస్ కు ఒక అమ్మాయిని కిడ్నప్ చేసి ఎత్తుకొచ్చే గ్యాంగ్ చుట్టూ.. ఈ మూవీ కథ కొనసాగుతుంది. చిన్నపటినుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉన్న.. ఓ నలుగురికి బాగా డబ్బు అవసరం అయ్యి.. ఆ ఊరి ఎమ్మెల్యే కూతురుని కిడ్నప్ చేసేందుకు రెడీ అవుతారు. ప్లాన్ ప్రకారం వారు ఆ అమ్మాయిని కిడ్నప్ చేసి.. ఓ బంగ్లాకు తీసుకుని వెళ్తారు.. కానీ ఆల్రెడీ ఆ బంగ్లాలో ఓ దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యానికి వీరంటే అసలు పడదు. అక్కడికి వెళ్లిన తర్వాత వీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ? ఆ తర్వాత ఏమైంది ? ఆ బంగ్లా నుంచి వారు బయటపడ్డారా లేదా ? అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.