OTT Web Series : సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తుంది.. ఇంతకీ ఏ సిరీస్ అంటే!

OTT Web Series : సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తుంది.. ఇంతకీ ఏ సిరీస్ అంటే!

వెబ్ సిరీస్ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. బాగా ఆదరణ పొందిన వెబ్ సిరీస్ లకు సరికొత్త సీజన్స్ ను ప్రకటిస్తున్నారు మేకర్స్ . తాజాగా మరొక ఫేమస్ వెబ్ సిరీస్ రెండవ సీజన్ కు సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది.

వెబ్ సిరీస్ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. బాగా ఆదరణ పొందిన వెబ్ సిరీస్ లకు సరికొత్త సీజన్స్ ను ప్రకటిస్తున్నారు మేకర్స్ . తాజాగా మరొక ఫేమస్ వెబ్ సిరీస్ రెండవ సీజన్ కు సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది.

వెబ్ సిరీస్ లంటే ప్రతి ఒక్కరు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనితో ఎప్పుడో రిలీజ్ అయినా వెబ్ సిరీస్ లకు కూడా ఇప్పుడు సరికొత్త సీజన్స్ ను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇలా ఇప్పటివరకు ఎన్నో వెబ్ సిరీస్ లకు కంటిన్యుషన్ వచ్చిన సిరీస్ లకు కూడా మంచి ఆదరణ లభించింది. దీనితో ఇప్పుడు రెండేళ్ల క్రితం బాగా ఫేమస్ అయినా ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు.. రెండవ సిరీస్ రాబోతుంది. ఇక తాజాగా దానికి సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీనితో ఇక రెండవ సీజన్ మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ మొదటి సీజన్ ను మీరు చూశారా లేదా ఈ విషయాల గురించి చూసేయండి.

రెండేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ లో వచ్చిన వెబ్ సిరీస్ “తనావ్”. ఈ సిరీస్ ను సుధీర్ మిశ్రా , ఇ. నివాస్ కలిసి డైరెక్ట్ చేశారు . అప్పట్లో ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఇప్పుడు ఈ సిరీస్ రెండవ సీజన్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సిరీస్ ఇజ్రాయిల్ లో వచ్చిన టీవీ సిరీస్.. ఫౌదా ఆధారంగా తెరకెక్కిన సిరీస్. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ ను గమనిస్తే.. రెండవ సీజన్ మొదటి సీజన్ కంటే కూడా.. మరింత థ్రిల్లింగ్ గా కొనసాగనున్నట్లు తెలుస్తుంది. రెండవ సీజన్ అంతా కూడా.. ఉగ్రవాదం , దానివలన దేశం ఎదుర్కోబోయే సమస్యలు , సవాళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక ఈ సిరీస్ అనౌన్సుమెంట్ ను “తర్వాత ఏం జరగబోతోంది? ఇందులో ఉన్న వారి పరిస్థితి ఏం కానుంది? సాహసం, అత్యాశ, ప్రేమ, ప్రతీకారం, మోసం చుట్టూ తిరిగే స్టోరీలతో రానున్న యాక్షన్ ప్యాక్ట్ వెబ్ సిరీస్ తనావ్ సీజన్ 2. అవార్డు విన్నింగ్ సుధీర్ మిశ్రా, నివాస్ డైరెక్ట్ చేశారు” అనే క్యాప్షన్ తో అనౌన్స్ చేశారు మేకర్స్.

ఇక తనావ్ సిరీస్ మొదటి సీజన్ కథ విషయానికొస్తే.. ఈ సిరీస్ మొత్తం కూడా.. పాకిస్థాన్ ఉగ్రవాదులు, ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన.. స్పెషల్ టాస్క్ మధ్య జరిగిన యుద్ధం.. ఇలా కొనసాగుతూ ఉంటుంది. మొదటి సీజన్ లో.. మానవ్ విజ్ , జత్ కపూర్, గౌరవ్ అరోరా, అర్బాజ్ ఖాన్, శశాంక్ అరోరా, సత్యదీప్ మిశ్రా లాంటి వారు నటించారు. ఇక ఈ సిరీస్ కు ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 7.6 రేటింగ్ దక్కింది.. మొదటి సీజన్ మొత్తం 12 ఎపిసోడ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా చూడకపోతే మాత్రం.. రెండవ సీజన్ వచ్చే లోపు మొదటి సీజన్ ను కంప్లీట్ చేసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments