7 నెలల తర్వాత OTT లో మలయాళ సర్వైవల్ థ్రిల్లర్..’మాయావనం’

OTT Survival Thriller Movie: సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ ను ఈ మధ్య బాగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఏకంగా థియేటర్ లో రిలీజ్ అయినా ఏడు నెలల తర్వాత.. మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

OTT Survival Thriller Movie: సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ ను ఈ మధ్య బాగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఏకంగా థియేటర్ లో రిలీజ్ అయినా ఏడు నెలల తర్వాత.. మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఏంటో చూసేద్దాం.

మలయాళ సినిమాలను ప్రేక్షకులంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఆ సినిమాలలో ఉండే కంటెంట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ప్రతి సినిమాలోనూ ఎదో ఒక కొత్త ఎలిమెంట్ ను చూపిస్తూ ఉంటారు. దీనితో మూవీ లవర్స్ కూడా ఈ సినిమాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక సాధారణంగానే ఈ మధ్య ఎక్కువగా సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్ లో రిలీజ్ ఏడు నెలల తర్వాత ఓటీటీ లోకి ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది . మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ మలయాళీ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా పేరు.. ‘మాయావనం’. జనవరి 19న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమాకు అంతగా ఆదరణ లభించలేదు. కానీ ఈ మధ్యన థియేటర్ లో మెప్పించని సినిమాలు కూడా ఓటీటీ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి కాబట్టి.. ఈ సినిమా కూడా ఓటీటీ లో మంచి టాక్ ను సంపాదించుకుంటుందేమో చూడాలి. ఇక ఇప్పుడు కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ప్రస్తుతం ఈ సినిమ రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ మూవీని రెంట్ లేకుండా తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఇక మాయావనం సినిమా ప్లాట్ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా.. నలుగురు మెడికల్ స్టూడెంట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ స్టూడెంట్స్ అంతా కలిసి ఓ అడవికి వెళ్తారు. అక్కడ వారికి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురౌతాయి. వాటి నుంచి వారు ఎలా తప్పించుకోగలిగారు? ఆ అడవిలో నుంచి ప్రాణాలతో బయటపడ్డారా లేదా ? అనేది ఈ మూవీ కథ. ఈ సినిమాను జయత్ లాల్ డైరెక్ట్ చేయగా.. ఆదిత్య సాయి, జాఫర్ ఇడుక్కి, సెంథిల్ లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. మరి ఈ మూవీ ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments