Swetha
Jaat movie OTT streaming date: కేవలం టాలీవుడ్ సినిమాలకోసమే కాకుండా బాలీవుడ్ సినిమాల ఓటిటి రిలీజ్ ల కోసం కూడా ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వాటిలో బాలీవుడ్ బాలయ్య సన్నీ డియోల్ నటించిన జాట్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు తెలుగు దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించడం విశేషం.

కేవలం టాలీవుడ్ సినిమాలకోసమే కాకుండా బాలీవుడ్ సినిమాల ఓటిటి రిలీజ్ ల కోసం కూడా ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వాటిలో బాలీవుడ్ బాలయ్య సన్నీ డియోల్ నటించిన జాట్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు తెలుగు దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించడం విశేషం. హిందీ మార్కెట్ లో ఈ మూవీకి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. సన్నీ డియోల్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
అయితే ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి దాదాపు రెండు నెలలు కావొస్తుంది. ఏప్రిల్ లోనే ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ ఓటిటి కి మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు ఓటిటి రిలీజ్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ జూన్ 6 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాను కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారట. ఆ తర్వాత తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకుని వస్తారేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.