iDreamPost
android-app
ios-app

OTT లోకి కోట్లు కొల్లగొట్టిన హర్రర్ కామెడీ మూవీ స్త్రీ2.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

  • Published Sep 10, 2024 | 4:45 AM Updated Updated Sep 10, 2024 | 4:45 AM

Stree 2 Movie OTT Streaming Date: హాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా కంటెంట్ ను బట్టి సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇక వాటిలో బాలీవుడ్ హర్రర్ కామెడీ చిత్రాల గురించైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో లేటెస్ట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా హర్రర్ మూవీ స్త్రీ 2 ఓటీటీ స్టర్లోకి వచ్చేస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Stree 2 Movie OTT Streaming Date: హాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా కంటెంట్ ను బట్టి సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇక వాటిలో బాలీవుడ్ హర్రర్ కామెడీ చిత్రాల గురించైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో లేటెస్ట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా హర్రర్ మూవీ స్త్రీ 2 ఓటీటీ స్టర్లోకి వచ్చేస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 10, 2024 | 4:45 AMUpdated Sep 10, 2024 | 4:45 AM
OTT లోకి కోట్లు కొల్లగొట్టిన హర్రర్ కామెడీ మూవీ స్త్రీ2.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

హర్రర్ సినిమాలకు కొదవే లేదు. ఈ మధ్య వాటికి లభించే క్రేజ్ కూడా అలానే ఉంది. అటు థియేటర్స్ లోను.. ఇటు ఓటీటీ లోను హర్రర్ సినిమాలు మంచి బజ్ సంపాదించుకుంటున్నాయి. ఈ క్రమంలో 2018లో రిలీజ్ అయినా స్త్రీ మూవీకి ఎలాంటి క్రేజ్ లభించిందో తెలియనిది కాదు. దింతో ఇప్పుడు హర్రర్ మూవీస్ కి పెరుగుతున్న క్రేజ్ చూసి.. ఐదేళ్ల తర్వాత ఆ సినిమాకు సిక్వెల్ గా స్త్రీ 2 ను రూపొందించారు మేకర్స్. ఆగష్టు 15న థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీ లో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది అనే వివరాలను చూసేద్దాం.

సుమారు రూ.25కోట్ల బడ్జెట్‍తో రూపొందించిన ఈ సినిమా.. మొదటి షో నుంచి సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుని.. థియేట్రికల్ రన్ క్లోజ్ అయ్యే సమయానికి.. ఏకంగా 750 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించి రికార్డ్ బ్రేక్ చేసింది. 2024 రిలీజ్ అయినా హిందీ సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్, రాజ్‍కుమార్ రావ్‍తో పాటు పంజక్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఇక థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఈ మూవీ ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 27 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ రానున్నట్లు ప్రకటించారు మేకర్స్. కాబట్టి ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినా వారు ఎంచక్కా ఓటీటీ లో చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ అంతా కూడా మధ్య ప్రదేశ్ లోని చందేరి గ్రామంలో కొనసాగుతూ ఉంటుంది. అక్కడ మహిళలను అపహరించే కొన్ని దుష్టశక్తులను హరించే దిశగా వారికి ఎదురయ్యే పరిస్థితులు ఏంటి అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ మూవీ స్టోరీ కొనసాగుతుంది.ఇక ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు , తమిళం , మలయాళం కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.. ఇక ఈ మూవీలో రాజ్‌కుమార్ రావ్‌, శ్ర‌ద్ధాక‌పూర్ యాక్టింగ్‌తోపాటు.. మూవీ లో చూపించిన ఊహించని ట్విస్ట్ లకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. థియేటర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందంటే.. ఇక ఓటీటీ లో ఈ మూవీ రికార్డ్ వ్యూస్ సాధిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet