iDreamPost
android-app
ios-app

Sriranga Neethulu OTT: మరో ప్లాట్ ఫార్మ్ లోకి సుహాస్ మూవీ.. ఫ్రీ గా చూసేయొచ్చు

  • Published May 29, 2024 | 12:45 PM Updated Updated May 29, 2024 | 1:16 PM

కొన్ని సినిమాలు ఓటీటీ లో ఊహించని షాక్స్ ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు సుహాస్ నటించిన ఓ సినిమా కూడా ప్రేక్షకులకు అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించింది, మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

కొన్ని సినిమాలు ఓటీటీ లో ఊహించని షాక్స్ ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు సుహాస్ నటించిన ఓ సినిమా కూడా ప్రేక్షకులకు అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించింది, మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published May 29, 2024 | 12:45 PMUpdated May 29, 2024 | 1:16 PM
Sriranga Neethulu OTT: మరో ప్లాట్ ఫార్మ్ లోకి సుహాస్ మూవీ.. ఫ్రీ గా చూసేయొచ్చు

ఇప్పటివరకు థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా దాదాపు ఓటీటీ లోకి వచేసినట్లే. ఆయా సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు కానీ.. ఆయా సినిమాలు ఓటీటీ లోకి మాత్రం శరవేగంగా ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సుహాస్ నటించిన సినిమాలంటే అంబాజీపేట మ్యారేజి బ్యాండ్, ప్రసన్న వదనం సినిమాలనే అందరికి తెలుసు. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్ లో రిలీజ్ అయ్యి.. డీసెంట్ టాక్ ను సంపాదించుకున్నాయి. కలెక్షన్స్ పరంగా ఎలా ఉన్నా కానీ.. కథ పరంగా మాత్రం ప్రేక్షకులను బాగానే మెప్పించాయి. అయితే ఈ రెండు సినిమాలకు మధ్యలో సుహాస్ నటించిన మరో సినిమా శ్రీరంగ నీతులు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వినిపిస్తున్నాయి.

శ్రీరంగ నీతులు సినిమా ఏప్రిల్ 11 వ తేదీన థియేటర్ లో విడుదల అయింది. ఇక ఈ సినిమాకు ముందు వెనుక వచ్చిన సుహాస్ రెండు సినిమాలు కూడా అటు థియేటర్ లోను, ఇటు ఓటీటీ లోను మంచి టాక్ నే సంపాదించుకుంటున్నాయి. కానీ శ్రీరంగ నీతులు సినిమా మాత్రం అసలు రిలీజ్ అయినట్లుగా కూడా ఎవరికి తెలియదు. పోనీ ఓటీటీ లో అయినా రిలీజ్ అయిందా అంటే అది కూడా లేదు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ బజ్ వినిపించింది. ఈ సినిమాను జూన్ 7 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది అనే టాక్ నడిచింది. కానీ ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా.. అనుకున్న దానికంటే ముందే ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇందులోనే కాకుండా మరో ప్లాట్ ఫార్మ్ లో కూడా ఈ సినిమా ఫ్రీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను మే 30 నుంచి యూట్యూబ్‍లో శ్రీభవానీ హెచ్‍డీ మూవీస్ ఛానెల్‍‍లో ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్నీ ఆ ఛానెల్ అధికారికంగా ప్రకటించింది.

అయితే, ఇప్పటివరకు థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు కాస్త ఆలస్యం అయినా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చేవి. కానీ, ఇలా డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి మాత్రం వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ సినిమా అటు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోను, ఇటు డైరెక్ట్ గా యూట్యూబ్ లోను రానుంది. దీనితో ఈ సినిమా డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి రావడంతో ప్రేక్షకులు కాస్త ఆశ్చర్య పోయి.. అసలు దాని వెనుక ఉన్న కారణం ఏంటా అని ఆరా తీస్తున్నారు. ఈ సినిమా థియేటర్ లో ఘోరంగా విఫలం అవ్వడం వలనే.. ఓటీటీ డీల్ సరిగా జరగలేదా అనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ సినిమా యూట్యూబ్ లోకి వచ్చిన తర్వాత ఎంత మందిని మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetturka girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş