iDreamPost
android-app
ios-app

Love Me: వారం ముందుగానే OTTలోకి లవ్‌ మీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

  • Published Jun 11, 2024 | 1:12 PM Updated Updated Jun 11, 2024 | 1:12 PM

వైష్ణవి చైతన్య, ఆశీష్‌ జంటగా వచ్చిన హరర్‌, లవ్‌ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఆసక్తకర వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

వైష్ణవి చైతన్య, ఆశీష్‌ జంటగా వచ్చిన హరర్‌, లవ్‌ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఆసక్తకర వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

  • Published Jun 11, 2024 | 1:12 PMUpdated Jun 11, 2024 | 1:12 PM
Love Me: వారం ముందుగానే OTTలోకి లవ్‌ మీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

ఓటీటీలకు హవా పెరిగిన తర్వాత.. సరికొత్త కథలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు దర్శక, నిర్మాతలు. అలానే వేరే భాషల్లో బాగా హిట్టైన సినిమాలను కూడా ఆయా ప్రాంతీయ భాషల్లోకి డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తున్నారు. ఇక సీజన్‌లతో సంబంధం లేకుండా ఎప్పటికి క్రేజ్‌ తగ్గని జానర్‌ ఏదైనా ఉందా అంటే.. హారర్‌ థ్రిల్లర్‌. పాత కథ అయినా సరే.. ఆసక్తికరంగా తెరకెక్కిస్తే.. ప్రేక్షకులు ఎప్పుడూ వాటిని ఆదరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా తెలుగులో హరర్‌ అండ్‌ లవ్‌ స్టోరీ లవ్‌ మీ విడుదలయ్యింది. కాకపోతే ఊహించిన రేంజ్‌లో విజయం సాధించలేదు. ఇక ఈ సినిమా వారం ముందుగానే ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..

షార్ట్‌ ఫిల్మ్స్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందిపుచ్చుకుని.. బేబీ సినిమాతో ఏకంగా హీరోయిన్‌గా మారింది వైష్ణవి. ఈ సినిమాతో అమ్మడికి విపరీతైమన క్రేజ్‌ పెరిగింది. బేబీ సినిమా భారీ విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత వైష్ణవి.. తాజాగా లవ్‌ మీ అనే హరర్‌ అండ్‌ లవ్‌ స్టోరీలో నటించింది. దిల్‌ రాజు కుటుంబం నుంచి వచ్చిన ఆశీష్‌.. ఈ మూవీలో హీరోగా నటించాడు. కిరణ్‌ భీమవరం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య మే 25న విడుదలయ్యింది. అయితే అంచనాలను అందుకోలేకపోయింది. మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది.

Love Me

థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రం.. ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. అది కూడా అనుకున్న దాని కంటే వారం ముందుగానే. లవ్‌ మీ చిత్రం ఓటీటీ రైట్స్‌ను ఆహా దక్కించుకుంది. భారీ మొత్తం చెల్లించి ఈ సినిమాను కొనుగోలు చేసింది. వాస్తవానికి ఈ సినిమా జూన్‌ 23 అలా ఓటీటీలో స్ట్రీమ్‌ అవ్వాలి. కానీ వారం ముందుగానే అనగా జూన్‌ 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవ్వనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆహా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

లవ్‌ మీ సినిమాలో వైష్ణవి చైతన్య, ఆశీష్‌ హీరోహీరోయిన్లుగా నటించగా.. సిమ్రన్‌ చౌదరి, రవి కృష్ణలు కీలక పాత్రల్లో మెరిసారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. హర్షిత్‌ రెడ్డి, హన్సిత నిర్మాతలుగా వ్యవహరించారు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş