iDreamPost
android-app
ios-app

OTTలోకి యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పటి నుండంటే..?

  • Published Mar 25, 2024 | 7:38 PM Updated Updated Mar 25, 2024 | 7:38 PM

జయం రవి హీరోగా కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సైరన్. గత నెలలో థియేటర్లలో సందడి చేసిన ఈచిత్రం. . ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది.

జయం రవి హీరోగా కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సైరన్. గత నెలలో థియేటర్లలో సందడి చేసిన ఈచిత్రం. . ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది.

  • Published Mar 25, 2024 | 7:38 PMUpdated Mar 25, 2024 | 7:38 PM
OTTలోకి యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పటి నుండంటే..?

కోలీవుడ్‌లో స్టార్ అండ్ యంగ్ స్టార్లలో ఒకరు జయం రవి. తెలుగు హిట్ మూవీ జయం రీమేక్‌ చిత్రంతో తమిళనాడులో ఎంట్రీ ఇచ్చి.. జయం రవిగా మారిపోయాడు. చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగులో బావ బామ్మర్ది, పల్నాటి సింహం వంటి చిత్రాల్లో నటించిన మోహన్ ఎడిటర్ కుమారుడు.. అనతి కాలంలోనే టాప్ హీరోగా ఎదిగాడు. తెలుగు డబ్బింగ్ సినిమాలతో స్టార్ హీరోగా మారిన ఈ కుర్రాడు..టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. తన సినిమాలు టాలీవుడ్‌లో డబ్బింగ్ చేసుకుని మంచి మార్కెట్ ఏర్పరుచుకోగలిగాడు. తాజాగా సైరన్ మూవీతో సందడి చేశాడు. ఫిబ్రవరి 16న థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ.. మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించింది.

కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో సముద్ర ఖని, యోగి బాబు, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించాడు. హోం మూవీ మేకర్స్ పతాకంపై సుజాత విజయ్ కుమార్ నిర్మించగా..నూతన దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ కథ, డైరెక్షన్ చేశాడు. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేసింది. బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి సందడి చేయడానికి వచ్చేస్తుంది. దీని స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. ఇంతకు ఈ మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే.?

ఫిబ్రవరి 16న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సైరన్ మూవీ ఏప్రిల్ 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడదుల కానుంది. కాగా, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక సినిమా ప్లాట్ విషయానికి వస్తే భార్య జెన్నీఫర్ (అనుపమ పరమేశ్వరన్)ను మర్డర్ చేసిన కేసులో తిలగన్‌కు (జయం రవి)కి యావజ్జీవ శిక్ష పడుతుంది. అతడికి ఓ కూతురు ఉంటుంది. పెరోల్ పై జైలు నుండి బయటకు వస్తాడు. అయితే తల్లిని చంపినందుకు తండ్రిని అసహ్యించుకుంటుంది కూతురు. బంధువుల ఇంటికి వెళ్లిపోతుంది. బయటకు వచ్చిన తిలగన్ మరో వ్యక్తిని చంపుతాడు. నందిని (కీర్తిసురేష్) ఈ కేసు టేకప్ చేస్తోంది. తెలివిగా హత్యలు చేసి తప్పించుకుంటున్న తిలగన్‌ను ఎలా పట్టుకుంటుంది.. అసలు భార్యను తిలగన్ ఎందుకు చంపాడన్నది మిగిలిన కథ..?

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş