iDreamPost
android-app
ios-app

సడెన్ గా OTT లోకి అశ్విన్ బాబు ‘శివం భజే’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 30, 2024 | 11:49 AM Updated Updated Aug 30, 2024 | 11:49 AM

Shivam Bhaje Movie OTT Streaming Details: డిజిటల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమా ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చిన తెలుగు మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

Shivam Bhaje Movie OTT Streaming Details: డిజిటల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమా ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చిన తెలుగు మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

  • Published Aug 30, 2024 | 11:49 AMUpdated Aug 30, 2024 | 11:49 AM
సడెన్ గా OTT లోకి అశ్విన్ బాబు ‘శివం భజే’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఈ వారం ఓటీటీలో ముందస్తు ఇన్ఫర్మేషన్ తో వచ్చిన సినిమాలకంటే కూడా.. సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అందులోను తెలుగు సినిమాలు ఎక్కువగా ఉండడం విశేషం. ఈ క్రమంలో ఈ వారం ఆల్రెడీ ఉన్న సినిమాలతో పాటు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయింది. అది మరేదో కాదు.. హీరో అశ్విన్ బాబు నటించిన శివం భజే మూవీ. అశ్విన్ బాబు తన కెరీర్ లో కొన్ని సినిమాలు తీసిన కానీ వాటిలో మంచి కంటెంట్ ఉంటుంది. ఈ సినిమా కూడా అలాంటిదే. థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా పాజిటివ్ టాక్ నే సంపాదించుకుని ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

అశ్విన్ బాబు నటించిన శివం భజే మూవీ.. ఆగష్టు 1న థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు అబ్దుల్ అప్సర్ హుస్సేన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో అశ్విన్ బాబు, దిగంగగనా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్ లాంటి వారు.. ప్రధాన పాత్రలలో నటించారు. థియేటర్ లో ఈ సినిమాకు మంచి టాక్ నే సంపాదించుకుంది. అశ్విన్ బాబు సినిమాలలో ఎదో ఒక డిఫరెంటే ఎలిమెంట్ కచ్చితంగా ఉంటుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాకు మిస్ అయినా వారు ఎంచక్కా ఓటీటీ లో ఈ మూవీని చూసేయండి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఓటీటీ లో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇక ఈ మూవీ కథ విషయానికొస్తే.. అశ్విన్ బాబు ఈ మూవీలో ఓ లోన్ రికవరీ ఏజెంట్. ఇలా లోన్స్ రికవరీ చేసే ప్రాసెస్ లో అతనికి శైలజ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ తర్వాత కొద్దీ సమయంలోనే వారి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కొంతకాలం అంతా బాగానే కొనసాగుతుంది. అయితే ఓసారి ఎదో గొడవలో.. అశ్విన్ కళ్ళు పోతాయి. తన అదృష్టం కొద్దీ ఐ డోనార్ అయితే దొరుకుతారు. కానీ ఐ ఆపరేషన్ తర్వాత.. కంటి చూపు వచ్చిన తర్వాత.. అతనికి విచిత్రమైన విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడూ తనని ఎదో ఒక గతం వేటాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు అతనిని వెంటాడే గతం ఎవరిదీ ? చందుకు పెట్టిన కళ్ళు ఎవరివి ? ఆ తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş