iDreamPost
android-app
ios-app

Sharathulu Vartisthai OTT: OTT లోకి వచ్చేసిన షరతులు వర్తిస్తాయి మూవీ.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఇదే..

  • Published May 18, 2024 | 12:25 PM Updated Updated May 18, 2024 | 12:25 PM

ఓటీటీ ప్రేక్షకుల ముందుకు కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. ప్రేక్షకులలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కొత్త సినిమాలను రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే మరొక కొత్త సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది.

ఓటీటీ ప్రేక్షకుల ముందుకు కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. ప్రేక్షకులలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కొత్త సినిమాలను రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే మరొక కొత్త సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది.

  • Published May 18, 2024 | 12:25 PMUpdated May 18, 2024 | 12:25 PM
Sharathulu Vartisthai OTT: OTT లోకి వచ్చేసిన షరతులు వర్తిస్తాయి మూవీ..  స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఇదే..

సినిమాలు లేక థియేటర్ లు అయితే సైలెంట్ అయిపోయాయి కానీ ఓటీటీ మాత్రం అలా కాదు .. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తుంది. పెద్ద పెద్ద స్టార్ సెలెబ్రిటీలు సైతం ఓటీటీ లో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీనితో మేకర్స్ కూడా దానికి తగినట్టుగానే ప్లాన్ చేస్తూ.. మంచి కంటెంట్ ను సినిమాలు, వెబ్ సిరీస్ ల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తారు. ఇలా ప్రతి వారం ఓటీటీ లో డజన్లలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా “షరతులు వర్తిస్తాయి”. చైతన్య రావు, భూమి శెట్టి, నంద కిశోర్, పెద్దింటి అశోక్ కుమార్, స్వర్ణ కిలరి, గుంటుల రాధికా, ఆర్జే అవినాష్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో అలరించారు. కాగా ఈ సినిమాకు కుమార స్వామి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 15 న థియేటర్ లో రిలీజ్ అయ్యి.. డీసెంట్ టాక్ ను సంపాదించుకుంది. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో చైతన్య రావు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు సినిమాలలో కూడా తన ప్రతిభను కనబరుస్తూ.. మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ సొంతం చేసుకుంది. మే 18 నుంచి ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలని అనుకునే వారికి ఈ వీకెండ్ కు బెస్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు.

ఇక షరతులు వర్తిస్తాయి సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. తాను తండ్రిని కోల్పోతాడు.. దానితో అమ్మ, చెల్లి, తమ్ముడితో కలిసి జీవిస్తూ ఉంటాడు. కుటుంబం భాద్యత అంతా ఇతనిపైనే పడుతుంది. ఈ క్రమంలోనే హీరో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది. కొత్తగా పెళ్ళైన వీరికి ఇంకాస్త బాధ్యతలు పెరుగుతాయి. ఈ క్రమంలోనే వారు నివసించే ప్రాంతంలో.. చైన్ సిస్టం బిజినెస్ ఒకటి వస్తుంది. దీనిని హీరో అయితే నమ్ముడు కానీ.. అతని భార్య మాత్రం అతనికి తెలియకుండా ఉన్న డబ్బునంతా ఆ బిజినెస్ లో పెడుతుంది. హీరోకు ఈ విషయం తెలిసేలోపే కంపెనీ బోర్డు తిప్పేస్తుంది. దీనితో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? రోడ్డు పాలైన తన కుటుంబం కోసం హీరో ఏం చేశాడు ? చివరికి ఈ కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabet