iDreamPost
android-app
ios-app

Shanmukh: నేరుగా OTT లోకి బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Jun 12, 2024 | 11:35 AM Updated Updated Jun 12, 2024 | 11:50 AM

యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అందరికి పరిచయం అయినా ఎంతో మంది నటి నటులు.. ఇప్పుడు వెండి తెరమీద అవకాశాలు సైతం అందిపుచ్చుకుంటున్నారు. యూట్యూబ్ నుంచి ఒకింత ముందుకు వచ్చి.. ఓటీటీ లలోను తమ ప్రతిభను కనబరుస్తున్నారు.

యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అందరికి పరిచయం అయినా ఎంతో మంది నటి నటులు.. ఇప్పుడు వెండి తెరమీద అవకాశాలు సైతం అందిపుచ్చుకుంటున్నారు. యూట్యూబ్ నుంచి ఒకింత ముందుకు వచ్చి.. ఓటీటీ లలోను తమ ప్రతిభను కనబరుస్తున్నారు.

  • Published Jun 12, 2024 | 11:35 AMUpdated Jun 12, 2024 | 11:50 AM
Shanmukh: నేరుగా OTT లోకి బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

షణ్ముఖ్ జశ్వంత్.. ఈ వ్యక్తి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. యుట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇతను అందరికి పరిచయమే. ఇక ఇక్కడ వచ్చిన స్టార్ డమ్ తో.. ఇతని జర్నీ యూట్యూబ్ నుంచి బుల్లి తెర వరకు వెళ్ళింది. బిగ్ బాస్ లో ఇతని జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇవి మాత్రమే కాకుండా షణ్ముఖ్ అడపా దడపా ఏవో ఒక వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అయితే, ఇప్పటివరకు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ వరకే పరిమితం అయిన షణ్ముఖ్ .. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మూవీ కూడా నేరుగా ఓటీటీ లో రిలీజ్ కానుంది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

ఓటీటీ లకు ఇప్పుడు పెరుగుతున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద బడా హీరోలు సైతం ఓటీటీ ల వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది యూట్యూబర్స్ కూడా ఓటీటీ లవైపు మొగ్గు చూపుతున్నారు.ఈక్రమంలో త్వరలో షణ్ముఖ్ నటిస్తున్న ఓ సినిమా కూడా నేరుగా ఓటీటీ లోనే రిలీజ్ కానుంది. షణ్ముఖ్ డెబ్యూ మూవీ థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు “లీలా” అనే టైటిల్ ను కంఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది . ఇదొక యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఎంటర్టైనర్. తాజాగా మూవీకి సంబంధించిన ఓపెనింగ్ తాలూకా ఫోటోలను రివీల్ చేశారు. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

Shanumukh Movie into OTT

ఇక ఈ సినిమాలో షణ్ముఖ్ కు జోడిగా.. మ‌ల‌యాళ బ్యూటీ అన‌ఘా అజిత్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఈ సినిమా విషయాన్నీ స్వయంగా షణ్ముఖ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. నేను లీల త్వరలో మీ ముందుకు రాబోతున్నాం అని.. ఇదొక వెబ్ ఫిలిం అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ లో డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో పాటు.. బెక్కం వేణు గోపాల్ , ప్రవీణ్ కాండ్రేగుల లాంటి వారు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio