iDreamPost
android-app
ios-app

Shanmukh Jaswanth: అఫీషియల్: షణ్ముఖ్ జస్వంత్ హీరోగా OTT మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

  • Published Aug 04, 2024 | 3:06 PM Updated Updated Aug 04, 2024 | 3:06 PM

షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లతో ఫేమస్ అయిన యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్. ఈ ఫేంతోనే బిగ్ బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టి రన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఓటీటీ వేదికగా ఓ సిరీస్ చేశాడు. ఇప్పుడు మరో మూవీతో రాబోతున్నాడు.

షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లతో ఫేమస్ అయిన యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్. ఈ ఫేంతోనే బిగ్ బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టి రన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఓటీటీ వేదికగా ఓ సిరీస్ చేశాడు. ఇప్పుడు మరో మూవీతో రాబోతున్నాడు.

  • Published Aug 04, 2024 | 3:06 PMUpdated Aug 04, 2024 | 3:06 PM
Shanmukh Jaswanth: అఫీషియల్: షణ్ముఖ్ జస్వంత్  హీరోగా OTT మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఫేమస్ అయిన షన్ను.. బిగ్ బాస్ సీజన్ 5లో ఎంట్రీ ఇచ్చాడు. తన కో యూట్యూబర్, నటి, యాంకర్ సిరి హనుమంత్‌తో ఫ్రెండ్ షిప్ హద్దులు దాటేయడంతో విన్నర్ కావాల్సిన వాడు రన్నర్‌గా మిగిలాడు. అంతకు ముందు ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి విదితమే. ఈ ఏడాది కూడా సోదరుడు సంపత్ వినయ్ మూలంగా వార్తల్లో నిలిచాడు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత స్పెషల్ సాంగ్స్‌తో అలరించిన ఈ వైజాగ్ కుర్రాడు. స్టూడెంట్ అనే వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్నాడు. వీటితో పాటు ఓటీటీ వేదికగా ఓ వెబ్ సిరీస్ కూడా చేశాడు షన్ను. ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇప్పుడు మరో మూవీతో రాబోతున్నాడు ఈ సోషల్ మీడియా స్టార్. లీలా వినోదం పేరుతో సినిమా చేస్తున్నాడు షన్ను. ఓటీటీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ఈ యూట్యూబర్. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టైటిల్ ఎనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ చూస్తే నలుగురు కుర్రాళ్ల చుట్టూ ఈ కథ నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. అంతకు ముందు రిలీజ్ చేసిన ప్రోమోలో.. నలుగురు క్యారెక్టర్ నేమ్స్.. వారి వ్యక్తిత్వాల గురించి ప్రస్తావించాడు. సాగర్, ప్రసాద్, ఆకాశ్, రాజీ అనే నలుగురు కుర్రాళ్ల చుట్టూ కథ నడుస్తున్నట్లు తెలుస్తుంది. కాగా, ఇందులో షన్నుకి జోడిగా మలయాళ బ్యూటీ అనఘా అజిత్ నటిస్తుంది. షణ్ముఖ్, మదన్ మెహన్, శివ తుమ్మల, శరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

షన్ను తన సోషల్ మీడియా ఖాతాలో ఈ పోస్టర్ పంచుకుంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. ‘ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే. అసలు సంగతి ఏంటంటే.. మీ గ్యాంగ్‌లో మీరు చేసిన అన్ని దూల పనులు, జ్ఞాపకాలు గుర్తు చేస్తూ, అన్ లిమిటెడ్ వినోదం పంచడానికి మా గ్యాంగ్ వచ్చేస్తున్నారు. ఇంతకు టైటిల్ చెప్పలేదు కదా లీలా వినోదం’ అంటూ రాసుకొచ్చాడు. కాగా, ఇది ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 3 నుండి లీలా వినోదం స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.  ఈ మూవీకి పవన్ సుంకర దర్శకుడు. ఇక షన్ను విషయానికి వస్తే స్టూడెంట్ వెబ్ సిరీస్ తర్వాత ఇప్పుడు నేరుగా ఓటీటీ వేదికగా ఈ మూవీ చేస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom