iDreamPost
android-app
ios-app

OTT లోకి బాహుబ‌లి కట్టప్ప కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Aug 03, 2024 | 12:41 PM Updated Updated Aug 03, 2024 | 12:41 PM

OTT Telugu Comedy Web Series: బ్యాక్ టు బ్యాక్ కామెడీ సిరీస్ లతో ఓటీటీ లు ఊపందుకుంటున్నాయి. అది కూడా తెలుగు కంటెంట్ కావడం విశేషం. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఈ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Telugu Comedy Web Series: బ్యాక్ టు బ్యాక్ కామెడీ సిరీస్ లతో ఓటీటీ లు ఊపందుకుంటున్నాయి. అది కూడా తెలుగు కంటెంట్ కావడం విశేషం. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఈ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Aug 03, 2024 | 12:41 PMUpdated Aug 03, 2024 | 12:41 PM
OTT లోకి బాహుబ‌లి కట్టప్ప కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ఓటీటీ ట్రెండ్ లో వరుసగా వెబ్ సిరీస్ లకు విపరీతమైన క్రేజ్ లభించడం విశేషం అయితే.. అందులోను ఇప్పుడు తెలుగు కంటెంట్ కు ఆదరణ లభించడం మరొక విశేషం. గత కొన్ని వారాలుగా వరుసగా ప్రతి వారం నేరుగా ఓటీటీ లో ఎదో ఒక తెలుగు మూవీ, సిరీస్ రిలీజ్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ కామెడీ సిరీస్ లతో ఓటీటీ లు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం ఓటీటీ ట్రెండింగ్ మూవీస్ లో చాలా వరకు కామెడీ మూవీస్ ఏ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఈ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ కామెడీ సిరీస్ మరేదో కాదు.. బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారక్టర్ తో బాగా ఫేమస్ అయినా.. సత్య రాజ్ నటిస్తున్న “పర్ఫెక్ట్ హస్బెండ్” అనే సిరీస్. ఈ క్రమంలో తాజాగా ఈ సిరీస్ నుంచి సత్య రాజ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో పర్ఫెక్ట్ లుక్ తో సత్య రాజ్ తో పాటు.. సీనియర్ నటి సీత, మరొక ఇద్దరు నటులు కూడా కనిపిస్తున్నారు. చూడబోతుంటే ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా సిరీస్ గా ఉండబోతున్నట్లు అనిపిస్తుంది. కాగా ఈ సిరీస్ ను నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. అయితే స్ట్రీమింగ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ కామెడీ సిరీస్ ను తెలుగుతో పాటు.. మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో కూడా అందుబాటులోకి రానుంది.

పర్ఫెక్ట్ హస్బెండ్ సిరీస్ కు ఎన్ వీ నిర్మ‌ల్ కుమార్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సిరీస్ లో స‌త్య‌రాజ్‌, సీత‌తో పాటు.. వ‌ర్ష బొల్ల‌మ్మ‌, ర‌మ్య ప‌సుపులేటి కూడా ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సిరీస్ మొత్తం కూడా పది ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తి కాగా.. త్వరలోనే మిగిలిన ఎపిసోడ్స్ ను కూడా పూర్తి చేసుకుని.. స్ట్రీమింగ్ చేయనున్నారు. ఎలాగూ ఇప్పుడు కామెడీ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి.. ఈ సిరీస్ కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటుందని చెప్పి తీరాల్సిందే. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş