iDreamPost
android-app
ios-app

OTT లోకి మరో ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

  • Published Jun 19, 2024 | 12:21 PM Updated Updated Jun 19, 2024 | 12:21 PM

Sasimadhanam OTT: ఇప్పడు వెబ్ సిరీస్ లకు బాగా ఆదరణ పెరిగిపోయింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నీ కూడా వరుసగా కొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరొక వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Sasimadhanam OTT: ఇప్పడు వెబ్ సిరీస్ లకు బాగా ఆదరణ పెరిగిపోయింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నీ కూడా వరుసగా కొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరొక వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  • Published Jun 19, 2024 | 12:21 PMUpdated Jun 19, 2024 | 12:21 PM
OTT లోకి మరో ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. ఇక ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కూడా ఎంతో మంది ఫేమస్ అవుతూ వస్తున్నారు. దీనితో ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లో ఫేమస్ అయిన వారు కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోతున్నారు. యుట్యూబ్ లో ఫేమస్ అయినా ఓ జంట నుంచి ఓటీటీ లోకి సరికొత్త వెబ్ సిరీస్ రాబోతుంది. సింధూ ప‌వ‌న్, సోనియా సింగ్ జంటగా నటించిన ఈ వెబ్ సిరీస్ పేరు “శశి మథనం”. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సిరీస్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మరి ఈ సిరీస్ ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

శశి మథనం వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈటీవీ విన్ లో ఇప్పటికే మంచి మంచి కథలతో కొత్త సినిమాలను , సిరీస్ లను.. ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తుంది. అలానే ఇప్పుడు శశి మథనం పేరుతో మరొక వెబ్ సిరీస్. తాజాగా “చదువు రాణి సరస్వతి, శశి, లక్ష్మి కటాక్షం లేని మదన్ ల దాగుడుమూతలు చూద్దాము రారండి” అంటూ ఈ సిరీస్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక రిలీజ్ చేసిన టీజర్ ను గమనిస్తే.. ఇది ఓ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ అని అర్థమైపోతుంది. కాబట్టి యూత్ ను టార్గెట్ చేస్తూ ఈ సిరీస్ ను రూపొందించినట్లు తెలుస్తుంది. కాని ఈ సిరీస్ ను చూడాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సిరీస్ ను జులై 4 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.

Sasi Madhanam

ఇక సింధూ ప‌వ‌న్, సోనియా సింగ్ కాంబినేషన్ విషయానికొస్తే.. గతంలో కూడా వీరిద్దరూ కలిసి చాలానే షార్ట్ ఫిలిమ్స్ , సిరీస్ లు చేశారు. యూట్యూబ్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు వీరి షార్ట్ ఫిలిమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ అంటే.. అది ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటూ ఉంటారు అభిమానులు. మరి ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఓటీటీ కి అడుగుపెట్టిన ఈ రీల్ కపుల్.. ఎంత మందిని మెప్పిస్తారో వేచి చూడాలి. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetturboslotKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet