iDreamPost
android-app
ios-app

OTT New Release: OTT లోకి విరూపాక్ష బ్యూటీ న్యూ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

  • Published Jun 01, 2024 | 11:08 AM Updated Updated Jun 01, 2024 | 11:08 AM

ప్రస్తుతం ఓటీటీ లకు ఆదరణ బాగా పెరిగిపోయింది. దీనితో అటు వెండి తెరపైన అలరించిన వారు ఎలాగూ ఓటీటీ లకు వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన వారు కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నారు.

ప్రస్తుతం ఓటీటీ లకు ఆదరణ బాగా పెరిగిపోయింది. దీనితో అటు వెండి తెరపైన అలరించిన వారు ఎలాగూ ఓటీటీ లకు వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన వారు కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నారు.

  • Published Jun 01, 2024 | 11:08 AMUpdated Jun 01, 2024 | 11:08 AM
OTT New Release: OTT లోకి విరూపాక్ష బ్యూటీ  న్యూ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

ఇప్పుడు ఓటీటీ లలోనే కాకుండా సోషల్ మీడియాలను కంటెంట్ కు కొదవ లేదు. ఎందుకంటే యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కూడా ఎంతో మంది ఫేమస్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఓటీటీ లకు ఆదరణ బాగా పెరిగిపోతున్న క్రమంలో.. అటు వెండి తెరపైన అలరించిన స్టార్స్ అంతా కూడా ఓటీటీ ల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ లో ఫేమస్ అయిన వారు కూడా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ క్రమంలో యుట్యూబ్ లో ఫేమస్ అయినా ఓ జంట నుంచి ఓటీటీ లోకి సరికొత్త వెబ్ సిరీస్ రాబోతుంది. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

యుట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ లో ఫేమస్ అయిన పవన్ సిద్ధూ, సోనియా సింగ్ జంట గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టింగ్లీష్ గ‌ర్ల్‌ఫ్రెండ్‌, డెస్టినీ డేట్‌, యూఆర్‌మై ఫేవ‌రేట్ మిస్టేక్‌, వీకెండ్ పెళ్లిచూపుల‌తో పాటు ఇంకా ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ లో ఈ జంట ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఈ జంట మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి సోషల్ మీడియాలో కూడా అక్కడ ఇక్కడ బజ్ వినిపిస్తూనే ఉంటుంది . ఇక సోనియా సింగ్ పలు సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ఈ క్రమంలో ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ రొమాంటిక్ లవ్ కామెడీ వెబ్ సిరీస్ ను చేయబోతున్నారు . ఆ సిరీస్ పేరు “శశిమథనం”. ఈ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో విడుదల చేయబోతున్నారు. ఈటీవీ విన్ ద్వారా ఈ సిరీస్ జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

శశిమధనం వెబ్ సిరీస్ కు వినోద్ గాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఈ సిరీస్ లో ఓ యువ జంట మధ్యన వచ్చే గొడవలు, అలకలు, గిల్లికజ్జాలు ఎలా ఉంటాయో చూపించబోతున్నారు. ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఈ జంట ఎలాగూ ఫేమస్ ఏ కాబట్టి.. ఓటీటీ లో కూడా వీరికి మంచి మార్కులే పడతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఇప్పుడు ఓటీటీ లవర్స్ అంతా కూడా కొత్త కంటెంట్ ను చూసేందుకు ఇష్టపడుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది అనేదే వేచి చూడాలి. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş