iDreamPost
android-app
ios-app

Sundeep Kishan: టిల్లు స్క్వేర్ డైరెక్టర్ తో సందీప్ కిషన్! OTT ఆడియన్స్ కి పండగే!

  • Published Jul 17, 2024 | 12:04 PM Updated Updated Jul 17, 2024 | 12:04 PM

Tollywood Hero Entry In OTT: థియేటర్ లో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయి.. దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అనే విషయాలు పక్కనే పెట్టేస్తే.. ఇప్పుడు అంతా ఓటీటీ లో సినిమాలు , సిరీస్ లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

Tollywood Hero Entry In OTT: థియేటర్ లో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయి.. దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అనే విషయాలు పక్కనే పెట్టేస్తే.. ఇప్పుడు అంతా ఓటీటీ లో సినిమాలు , సిరీస్ లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

  • Published Jul 17, 2024 | 12:04 PMUpdated Jul 17, 2024 | 12:04 PM
Sundeep Kishan: టిల్లు స్క్వేర్ డైరెక్టర్ తో సందీప్ కిషన్! OTT ఆడియన్స్ కి పండగే!

ఎంటర్టైన్మెంట్ విభాగంలో సినిమాలకు మొదటి నుంచి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు సినిమాలను ఎంత ఇంట్రెస్టింగ్ గా ఆదరించేవారో ఇప్పటికి కూడా అదే రేంజ్ లో.. ఎఫెక్షన్ చూపిస్తున్నారు తెలుగు ఆడియన్స్. ఓ విధంగా చెప్పాలంటే ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు సినిమాలకు ఒకింత ఎక్కువ ఆదరణే లభిస్తుంది. థియేటర్ లో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయ.. దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనే విషయాలు పక్కన పెట్టేస్తే.. ఓటీటీ లో మాత్రం ఆ సినిమాలకు ఓ రేంజ్ లో ఆదరణ లభిస్తుంది. దీనితో చాలా మంది వెండి తెర నటీ నటులు.. ఓటీటీ లపై మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది అగ్ర తారలు కొన్ని సినిమాలు , సిరీస్ లలో కనిపించే అలరించగా.. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో.. ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.

థియేటర్ లో హిట్ కానీ సినిమాలు కూడా.. ఊహించని రేంజ్ లో ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేస్తున్నాయి. ఇప్పటివరకు చాలానే సినిమాలు ఈ విషయాన్నీ ప్రూవ్ చేశాయి. దీనితో ఇక ఓటీటీ లకు ఓ రేంజ్ లో ఆదరణ పెరుగుతుంది. మరి వెండి తెర నటి నటులు ఏం అనుకుంటున్నారో తెలియదు కానీ.. వారు కూడా ఓటీటీ లవైపు అడుగులు వేస్తున్నారు. ఇక ఇప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్న మరొక హీరో ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ నటుడు సందీప్ కిషన్. ఇండస్ట్రీలో బడా హీరోల సంగతి ఎలా ఉన్నా కానీ.. ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది చిన్న చిన్న హీరోలకు మాత్రం.. సరైన హిట్స్ పడక అంత క్రేజ్ సంపాదించుకోలేకపోతున్నారు. సందీప్ కిషన్ ఖాతాలో కూడా సరైన హిట్స్ పడి చాలా కాలమే అయింది. ఆఖరిగా సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన మూవీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇప్పుడు ఈ హీరో డైరెక్ట్ గా ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

సందీప్ కిషన్ ప్రస్తుతం.. టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఓ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ సిరీస్ ను డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తిచేసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఓటీటీ లలో వెబ్ సిరీస్ లకు పెరుగుతున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోను టిల్లు స్క్వేర్ సినిమాతో.. ఎక్కడ కూడా మొదటి పార్ట్ ఫ్లేవర్ మిస్ కాకుండా.. ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ అందించాడో కూడా చూశాము. ఇక సందీప్ విషయానికొస్తే ఎప్పుడు కూడా ప్రయోగాత్మకమైన పాత్రలనే ఎంచుకుంటూ ఉంటాడు. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సిరీస్ రాబోతుంది అంటే.. ఖచ్చితంగా అది ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పి తీరాల్సిందే. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio