సిటాడెల్: హనీ- బన్నీ టీజర్ రివ్యూ.. యాక్షన్ తో మెప్పించారా?

Samantha- Citadel Honey Bunny Teaser Review In Telugu: సమంత- వరుణ్ ధావన్ కాంబోలో స్టార్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిటాడెల్: హనీ బన్నీ. ఈ సిరీస్ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. మరి.. ఆ టీజర్ ఎలా ఉంది? యాక్షన్ తో మెప్పించారా? అనే విషయాలు చూద్దాం.

Samantha- Citadel Honey Bunny Teaser Review In Telugu: సమంత- వరుణ్ ధావన్ కాంబోలో స్టార్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిటాడెల్: హనీ బన్నీ. ఈ సిరీస్ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. మరి.. ఆ టీజర్ ఎలా ఉంది? యాక్షన్ తో మెప్పించారా? అనే విషయాలు చూద్దాం.

సమంత ప్రేక్షకులను పలకరించి చాలా రోజులు అవుతోంది. సినిమాలు మాత్రమే కాకుండా.. సమంత వెబ్ సిరీస్లలో కూడా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత పాత్ర బాగా హైలెట్ గా నిలిచింది. ఆ సిరీస్ తర్వాత సమంత నుంచి వస్తున్న మరో సిరీస్ సిటాడెల్: హనీ- బన్నీ అనే చెప్పాలి. ఈ సిరీస్ కి కూడా రాజ్ అండ్ డీకేనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ గురించి ఎప్పటి నుంచో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. ఇటీవల రాజ్ అండ్ డీకే కొన్ని హింట్స్ ఇచ్చారు. ఆగస్టు 1వ తేదీ గురించి అంతా అప్పుడు సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది అనుకున్నారు. కానీ, ఈరోజు టీజర్ ని రిలీజ్ చేసి.. హనీ- బన్నీని పరిచయం చేశారు. మరి.. ఆ టీజర్ ఎలా ఉందో చూద్దాం.

ఇప్పటికే హాలీవుడ్ నుంచి వచ్చిన సిటాడెల్ కి ఇది రీమేక్ అని అందరికీ తెలిసిందే. ఆ సిరీస్ లో ప్రియాంక చోప్రా- రిచర్డ్ మ్యాడెన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. మన సిటాడెల్ లో సమంత- వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. అందరూ రీమేక్ అయితే అది ఇదీ ఒకేలా ఉంటుందేమో అని అనుకోవచ్చు. కానీ, టీజర్ చూసిన తర్వాత ఆ భయం అయితే లేదు. ఎందుకంటే రెండిటికి ఎలాంటి పొంతన కనిపించడం లేదు. మన నేటివిటీకి తగ్గట్లు.. మన సిటీలను హైలెట్ చేస్తూ ఈ టీజర్ సాగింది. అలాగే హనీ- బన్నీ క్యారెక్టర్లను హైలెట్ చేస్తూ ఈ సిరీస్ లో ఉండే యాక్షన్ సీక్వెన్సులను పరిచయం చేశారు. మీరు ఎంత యాక్షన్ ఎక్స్ పెక్ట్ చేసినా కూడా అంతకు మించే ఈ సిరీస్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే కనిపించడం లేదు.

ఒక సిరీస్ ని.. అందులోనూ యాక్షన్ సిరీస్ ని తీయడంలో రాజ్ అండ్ డీకేల గురించి అందరికీ తెలుసు. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్ లతో వాళ్ల టాలెంట్ ని నిరూపించుకున్నారు. కాబట్టి వాళ్లు చెప్పే స్టోరీ ఏ రేంజ్ లో ఉండబోతోంది అనే ఊహాగానాలు మాత్రమే చేయాలి. అయితే టీజర్ చూసిన తర్వాత అది కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇందులో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా.. కొన్ని ఎమోషన్స్ ని కూడా పలికించారు. అంటే సమంత ఆనందంగా కనిపించడం, గన్స్ పట్టుకుని యుద్ధం చేయడం, ఒక చిన్నారి కోసం కంగారు పడటం అన్నీ చూపించారు. మొత్తానికి ఒక సర్వైవల్ యాక్షన్ డ్రామా అనే విషయం అయితే అర్థమవుతోంది. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. మరి.. సిటాడెల్: హనీ- బన్నీ టీజర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments