iDreamPost

OTT Release- Rush OTT: డైరెక్ట్ గా OTT లోకి ఫ్యామిలీ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

  • Published Jun 08, 2024 | 11:54 AMUpdated Jun 08, 2024 | 11:54 AM

ఇప్పుడు ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నీ కూడా స్వయంగా కొన్ని కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

ఇప్పుడు ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నీ కూడా స్వయంగా కొన్ని కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Jun 08, 2024 | 11:54 AMUpdated Jun 08, 2024 | 11:54 AM
OTT Release- Rush OTT: డైరెక్ట్ గా OTT లోకి ఫ్యామిలీ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే!

కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంటే కొన్ని సినిమాలు మాత్రం డైరెక్ట్ గా ఓటీటీ లోనే స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలు ఎలా రిలీజ్ అయినా కానీ ప్రేక్షకులు వాటి మీద చూపించే ఆదరణ మాత్రం కథలన బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ క్రమంలో ఇక ఇప్పుడు ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నీ కూడా స్వయంగా.. కొన్ని కొత్త కథలను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఓ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేస్తుంది. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

ఇప్పటివరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ ఎన్నో మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది. అయితే అందులో డైరెక్ట్ గా రిలీజ్ అయినా సినిమాలు మాత్రం కేవలం కొన్నే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈటీవీ విన్ ఓ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ పేరు ” రష్” . ఈటీవీ విన్ ఒరిజినల్ గా ఈ మూవీ వస్తుంది. ఈ సినిమాకు ప్రముఖ నటుడు, దర్శకుడు రవి బాబు కథను అందించారు. అంతే కాకుండా ఈ సినిమాకు ఆయనే నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాను జూన్ 13 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఆసక్తికరంగా మారింది.. ఈ సినిమా ట్రైలర్ ను గమనిస్తే.. భార్య, భర్త పిల్లలతో హాయిగా సాగిపోయే సంసారం.. కానీ అనుకోకుండా ఓ రోజు విధి వారిని చిన్న చూపు చూసింది. ఓ రోజు అనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో వారి జీవితాలన్నీ కూడా చిన్నా భిన్నం అయిపోయాయి. ఆమె భర్త ఓ రోడ్ యాక్సిండెంట్ కు గురి అవ్వడం, వాళ్ళ పాపా కిడ్నప్ అవ్వడం.. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సాధారణ గృహిణి ఎలా అపర ఖాళీగా మారింది. తన భర్తను, పిల్లలను కాపాడుకునేందుకు తానూ ఏమి చేసింది. అనేదే ఈ సినిమా కథ. కాబట్టి ఓ మంచి యాక్షన్ ఫ్యామిలి డ్రామా చూడాలంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి