iDreamPost
android-app
ios-app

Ekam Series OTT : ఎట్టకేలకు OTTలోకి రక్షిత్ శెట్టి వెబ్ సిరీస్ ఏకం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Jun 18, 2024 | 5:37 PM Updated Updated Jun 18, 2024 | 5:37 PM

ఓటీటీ లో కొత్త కంటెంట్ రాబోతుంది. అందులోను వెబ్ సిరీస్ లంటే ఈ మధ్య ఓ రేంజ్ లో ఆదరణ పెరిగిపోతుంది. ఇక ఇప్పుడు ఓటీటీ లోకి మరొక వెబ్ సిరీస్ రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

ఓటీటీ లో కొత్త కంటెంట్ రాబోతుంది. అందులోను వెబ్ సిరీస్ లంటే ఈ మధ్య ఓ రేంజ్ లో ఆదరణ పెరిగిపోతుంది. ఇక ఇప్పుడు ఓటీటీ లోకి మరొక వెబ్ సిరీస్ రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

  • Published Jun 18, 2024 | 5:37 PMUpdated Jun 18, 2024 | 5:37 PM
Ekam Series OTT : ఎట్టకేలకు OTTలోకి రక్షిత్ శెట్టి వెబ్ సిరీస్ ఏకం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇప్పుడు సినీ సెలెబ్రిటీలంతా కూడా ఓటీటీ బాట పడుతున్నారు. డైరెక్ట్ గా ఓటీటీ వెబ్ సిరీస్ లలో నటించడమో లేక.. ఓటీటీ సినిమాలను, సిరీస్ లను ప్రొడ్యూస్ చేయడమో లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రక్షిత్ శెట్టి ప్రొడ్యూస్ చేసిన వెబ్ సిరీస్ కు సంబంధించిన అప్ డేట్ ఒకటి వచ్చేసింది. రోజు రోజుకు ఓటీటీ లకు ఆదరణ బాగానే పెరుగుతుంది. కాబట్టి కొత్త కొత్త కథనాలతో వెబ్ సిరీస్ లు, సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. మరి ఈ క్రమంలో రక్షిత్ శెట్టి నటించిన ఈ సిరీస్ కు సంబంధించిన విషయాలను చూసేద్దాం.

రక్షిత్ శెట్టి ప్రొడ్యూస్ చేసిన ఈ సిరీస్ పేరు “ఏకం” . అయితే ఇది ఈ మధ్య కాలం వచ్చిన సిరీస్ అయితే కాదు. 2021 లో ఈ సిరీస్ పూర్తిగా రెడీ అయిపోయింది కానీ.. అప్పట్లో ఈ సిరీస్ పై ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీనితో ఈ సిరీస్ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈ సిరీస్ మొత్తం కూడా ఏడు స్టోరీలతో రన్ అవుతూ ఉంటుంది. దాదాపు మూడేళ్ళ తర్వాత ఈ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. కానీ రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో అయితే కాదు. ఈ వెబ్ సిరీస్ కోసం సొంతంగ ఓ వెబ్ సైట్ తో ప్లాట్ ఫార్మ్ ను తీసుకుని వచ్చారు రక్షిత్ శెట్టి. www.ekamtheseries.com అనే వెబ్ సైట్ లో జులై 13 నుంచి.. స్ట్రీమింగ్ కానుంది. ఇక్కడ మరొక చిక్కు ఏంటంటే.. ఈ వెబ్ సైట్ లో కూడా ఇది ఫ్రీ స్ట్రీమింగ్ కాదు.

ఈ వెబ్ సిరీస్ ను చూడాలంటే.. రూ.149 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. “ప్రేక్షకులకు మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని మేం ఈ ప్లాట్‍ఫామ్‍ను సృష్టించాం. ఇప్పుడు ఏకం సిరీస్‍ను ఒక్క సిరీస్ టికెట్ ధరతోనే మీ ముందుకు తీసుకొస్తున్నాం” అనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఈ వెబ్ సిరీస్ లో ప్రకాశ్ రాజ్, రాజ్ బీ శెట్టి, షైన్ శెట్టి లాంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. పరంవాహ్ స్టూడియోస్ పతాకంపై రక్షిత్ శెట్టి ఈ సిరీస్ ను నిర్మించారు. మరి ఈ సిరీస్ కొత్త వెబ్ సైట్ ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabethttps://kercabiofarm.hu/