iDreamPost
android-app
ios-app

Raju Yadav OTT: OTTలోకి గెటప్ శ్రీను రాజు యాదవ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Jun 04, 2024 | 5:31 PM Updated Updated Jun 04, 2024 | 5:31 PM

బుల్లి తెరపై రాణిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్న ఎంతో మంది నటి నటులు ఇప్పుడు వెండి తెరపైన కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజగా గెట్ అప్ శ్రీను మెయిన్ లీడ్ లో నటించిన రాజు యాదవ్ సినిమా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వివరాలు వచ్చేశాయి.

బుల్లి తెరపై రాణిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్న ఎంతో మంది నటి నటులు ఇప్పుడు వెండి తెరపైన కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజగా గెట్ అప్ శ్రీను మెయిన్ లీడ్ లో నటించిన రాజు యాదవ్ సినిమా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వివరాలు వచ్చేశాయి.

  • Published Jun 04, 2024 | 5:31 PMUpdated Jun 04, 2024 | 5:31 PM
Raju Yadav OTT: OTTలోకి గెటప్ శ్రీను రాజు యాదవ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బుల్లి తెరపై రాణిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్న ఎంతో మంది నటి నటులు ఇప్పుడు వెండి తెరపైన కూడా ఎంట్రీ ఇస్తున్నారు. జబర్దస్త్ పుణ్యమా అని చాలా మంది నటి నటులు ఫేమస్ అయ్యారు. ఇక ఇందులో రకరకాల గెట్ అప్స్ వేసి అందరిని తన కామెడీతో నవ్వించిన గెట్ అప్ శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అడపా దడపా చిన్న చిన్న సినిమాలలో కూడా నటించాడు. ఇక ఇప్పుడు గెట్ అప్ శ్రీను మెయిన్ లీడ్ లో నటించిన సినిమా “రాజు యాదవ్”. ఈ సినిమా మే 24 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ గురించి టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గెట్ అప్ శ్రీను హీరోగా నటించిన ఈ సినిమా … థియేటర్ లో ఊహించిన రేంజ్ లో విజయాన్ని అందుకోలేకపోయింది. రాజు యాదవ్ మూవీలో గెటప్ శ్రీనుతో పాటు.. ఆనంద చక్రవాణి, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్, రాకెట్ రాఘవ ముఖ్య పాత్రలు పోషించారు. రాజు యాదవ్ చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవి సైతం గెట్ అప్ శ్రీనుకు వీడియో రిలీజ్ చేశారు. అలాగే చిత్ర బృందం కూడా ఈ సినిమా గురించి బాగానే ప్రమోషన్ జరిపారు. దీనితో ఈ సినిమాపై అందరికి బాగానే అంచనాలు పెరిగాయి. కానీ ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. కాగా జూన్ 22 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇంకా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Raju Yadav

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. గెటప్ శ్రీను ముఖానికి ఓ క్రికెట్ బంతి తగులుతుంది. దానితో ఎప్పుడు తన ముఖం నవ్వుతు ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఓ డిజార్డర్ వస్తుంది. సో అతను ఎప్పుడు నవ్వుతూనే కనిపిస్తాడు. ఇది తగ్గడానికి సర్జరీ చేయించుకోవాలని డాక్టర్స్ చెప్పినా కూడా తన దగ్గర డబ్బులు లేక ఆగిపోతాడు. ఈ ప్రాసెస్ లో అతనికి చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. ఈ క్రమంలో అతనికి స్వీటీ అని అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ తర్వాత అతను ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత గెట్ అప్ శ్రీను జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. అతని సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet